సీఎం యోగి దారిలో ఖట్టర్ సర్కార్: బుల్డోజర్లతో గ్యాంగ్‌స్టర్ భవనం కూల్చివేత

ఛండీగఢ్: హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ బాటలో నడుస్తోంది. గురుగ్రామ్‌లోని బర్‌గుర్‌జార్ గ్రామంలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సుబే గుర్జార్ వ్యవసాయ భూమిలో అక్రమంగా నిర్మించిన మూడు అంతస్తుల భవనాన్ని మనేసర్ మున్సిపల్ కార్పొరేషన్ శుక్రవారం బుల్డోజర్లు కూల్చివేసింది.

ఈ సందర్భంగా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది గురువారం కూడా పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు.రెండు జేసీబీలతో గ్యాంగ్‌స్టర్‌ ఇంటి గోడ పగులగొట్టడం మొదలుపెట్టారు. కూల్చివేత కొనసాగతుండగా, అప్పుడే భారీ వర్షం ప్రారంభమైంది. సుమారు పావుగంట వేచి చూసినా వర్షం ఆగకపోవడంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.

సీఎం యోగి దారిలో హర్యానా ప్రభుత్వం.. గ్యాంగ్‌స్టర్ భవనం కూల్చివేత pic.twitter.com/r9yEkKO6U6

మనేసర్ మునిసిపల్ కార్పొరేషన్ డిటిపి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. బర్హ్‌గుర్జర్ గ్రామంలోని మూడు వేల చదరపు గజాల వ్యవసాయ భూమిలో రాష్ట్ర గుర్జర్ అనుమతి లేకుండా ఇంటిని నిర్మించారు. ఈ ఆస్తి అక్రమమని, అందుకే కూల్చివేస్తున్నామని చెప్పారు. మనేసర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మేరకు నోటీసు ఇచ్చింది.

గ్యాంగ్‌స్టర్ సుబే గుర్జార్‌పై 42 కేసులు నమోదయ్యాయి

గ్యాంగ్‌స్టర్ సుబే గుర్జార్‌పై హత్య, విమోచన క్రయధనం, హత్యాయత్నం సహా 42 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గ్యాంగ్‌స్టర్‌పై హర్యానా పోలీసులు ఐదు లక్షల రివార్డు కూడా ప్రకటించారు.చాలా ఏళ్ల పాటు శ్రమించి గ్యాంగ్‌స్టర్‌ను ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. గ్యాంగ్‌స్టర్ ప్రస్తుతం భోండ్సీ జైలులో ఉన్నాడు. గురుగ్రామ్, నుహ్, రెవారీ, పల్వాల్, ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ నేరాలకు పాల్పడ్డాడు. అప్పటి ఎస్టీఎఫ్ ఐజీ మానేసర్‌లోని హైవేకి సమీపంలో ఉన్న గ్యాంగ్‌స్టర్ భూమిలో పోలీసు పోస్ట్‌ను తెరిచారు.