వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. వీటికి సాటి ఇంకొకటి లేదు

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. బెంగళూరులో మాత్రమే కాకుండా ఢిల్లీ మరియు ముంబై వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితిలో కూడా కొన్ని కార్లు బయటపడగలిగాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అవి మంచి వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగి ఉండటమే. ఇలాంటి సందర్భాలు మళ్ళీ ఎదురైతే.. అలాంటి వాటిని అధిగమించడానికి ఉత్తమైన వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగి కార్లను గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

  వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. 

మహీంద్రా థార్ (Mahindra Thar):

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ‘థార్’ మంచి వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగిన ఆఫ్ రోడర్. ఇది 600 మిమీ వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. కావున వరదలు మరియి నీటితో నిండిన రోడ్లుపై కూడా సులభంగా ముందుకు వెళ్లగలుగుతుంది. దీనికి నిదర్శనం ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సంఘటన. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపైన క్లిక్ చేయండి.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N):

మహీంద్రా కంపెనీ యొక్క మరో అద్భుతమైన SUV స్కార్పియో ఎన్. ఇది కూడా అద్భుతమైన వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగి ఉంది. స్కార్పియో ఎన్ వాటర్ వాడింగ్ కెపాసిటీ 500 మిమీ వరకు ఉంటుంది. ఇది ఇటీవల రుజువైంది కూడా.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. మహీంద్రా స్కార్పియో ఎన్ ఇటీవల విడుదలైన కంపెనీ యొక్క కొత్త SUV. ఇది అద్భుతమైన మరియు అధునాతన ఫీచర్స్ కలిగిన మంచి పనితీరుని అందించే వాహనం. మహీంద్రా స్కార్పియో ఎన్ ‘ఎస్’ మరియు ‘ఎస్11’ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner):

భారతీయ మార్కెట్లో లభించే అత్యధిక వాటర్ వాడింగ్ కలిగిన కార్లలో టయోటా యొక్క ఫార్చ్యూనర్ కూడా ఒకటి. ఇది మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కంపెనీ బ్రాండ్ కూడా. టయోటా ఫార్చ్యూనర్ యొక్క వాటర్ వాడింగ్ కెపాసిటీ 700 మిమీ వరకు ఉంటుంది. కావున నీటితో నిండిన రోడ్లపైన కూడా రాజాలా ముందుకు వెళ్ళిపోతుంది.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. టయోటా హైలక్స్ (Toyota Hilux):

మన జాబితాలో అత్యథిగా వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగిం కార్లలో ‘టయోటా హైలక్స్’ కూడా ఒకటి. టయోటా హైలక్స్ యొక్క వాటర్ వాడింగ్ కెపాసిటీ 700 మి.మీ వరకు ఉంటుంది. కావున ఇది వర్షకాలంలో నీటితో నిండిన రోడ్లపైన కూడా సజావుగా ముందుకు సాగుతుంది.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. నిజానికి టయోటా హైలక్స్ పికప్ ట్రక్కు. అయితే ఇది దాదాపుగా ‘టయోటా ఫార్చ్యూనర్’ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 204 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక టన్ను లోడ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతే కాకుండా టయోటా ఫార్చ్యూనర్ కంటే కూడా తక్కువ ధరకే లభించే కారు కూడా.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. ఫోర్స్ గూర్ఖా (Force Gurkha):

మహీంద్రా థార్ కి ప్రత్యక్ష ప్రత్యర్థి అయిన ‘ఫోర్స్ గూర్ఖా’ మంచి ఆఫ్ రోడర్ మాత్రమే కాదు, మంచి వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగిన కారు కూడా. దీని వాటర్ వాడింగ్ కెపాసిటీ 550 మి.మీ వరకు ఉంటుంది. ఇది మహీంద్రా థార్ కంటే తక్కువ అయినప్పటికీ అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఎందుకంటే ఇది 4×4 సిస్టమ్ కలిగిన ఆఫ్ రోడర్ కాబట్టి.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. ఫోర్స్ గూర్ఖా 2.6-లీటర్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 1,400-2,400 ఆర్‌పిఎమ్ వద్ద 115 హెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున పనితీరు పరంగా వినియోగదారులు ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ (ISUZU D-Max V-Cross):

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పికప్ ట్రక్కులలో ‘ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్’ కూడా ఒకటి. ఇది నిజంగా గొప్ప ఆఫ్ రోడర్. ఎలాంటి రోడ్డులో అయినా నిస్సంకోచంగా ముందుకు వెళ్ళిపోతుంది. దీనికి ప్రధాన కారణం దాని వాటర్ వాడింగ్ కెపాసిటీ. అయితే ఇందులో వాటర్ వాడింగ్ కెపాసిటీ కేవలం 500 మిమీ మాత్రమే ఉంటుంది. కానీ పనితీరులో దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోయ్యే అవకాశం లేదు. కాబట్టే ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ కి ఇప్పటికి కూడా మంచి ఆదరణ ఉంది.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ (Land Rover Discovery Sport):

మన జాబితాలో అత్యంత ఖరీదైన వాహనాల్లో ఒకటి ల్యాండ్ రోవర్ యొక్క డిస్కవరీ స్పోర్ట్. ఇది ఆఫ్ రోడింగ్ చేయడానికి ఉత్తమమైన కారు. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ యొక్క వాటర్ వాడింగ్ కెపాసిటీ 600 మిమీ వరకు ఉంటుంది. అయితే ఇందులోని ఎలక్ట్రానిక్స్ మరియు సెన్సార్లు నీటితో నిండిన రోడ్లపైన ప్రయాణించేటప్పుడు మరింత ఉపయోగపడతాయి. కావున ఎక్కువమంది ఆఫ్ రోడర్లకు ఇష్టమైన కారు కూడా.

వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

వర్షాకాలంలో నీటితో నిండిన రోడ్లపైన ప్రయాణించడానికి పైన చెప్పిన కార్లు ఉపయోగపడతాయి. కావున అత్యధిక వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగిన కార్ల కోసం ఎదురుచూసేవారికి ఈ కథనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాతో పాటు, కొత్త కార్లు మరియు బైకుల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.