రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ – ఇందులో ఏది బెస్ట్?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్? రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ – ధరలు

మనం మొదటి ఈ రెండు బైకుల యొక్క డిజైన్ మరియు ఇతర వివరాలను తెలుసుకునే ముందు ధరలను గురించి తెలుసుకుందాం. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధరలు రూ. 1.55 లక్షల (ఎక్స్-షోరూమ్‌) నుంచి రూ. 1.66 లక్షల (ఎక్స్-షోరూమ్‌) వరకు ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్?

ఇక టీవీఎస్ రోనిన్ ధరల విషయానికి వస్తే, దీని ప్రారంభ ధరలు రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్‌) కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 1.71 లక్షల (ఎక్స్-షోరూమ్‌) వరకు ఉన్నాయి. ఈ రెండు బైకుల ధరలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్? రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ – డిజైన్

టీవీఎస్ రోనిన్ బైక్ లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, టియర్-డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ వంటివాటిని కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ డ్యూయల్-టోన్ కలర్ థీమ్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకూండా ఇది గోల్డెన్ ఫినిషింగ్‌లో యుఎస్డి ఫోర్క్స్ మరియు డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌లో మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. టీవీఎస్ రోనిన్ మోటార్ సైకిల్ బరువు 160 కేజీల వరకు ఉంటుంది. కావున రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్? రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 విషయానికి వస్తే, దీని ముందు భాగంలో స్పోర్ట్స్ సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో పాటు రౌండ్ సెమీ-డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. అయితే ఇందులోని ట్రిప్పర్ డిస్‌ప్లే మాత్రం ఆప్సనల్ గా ఎంచుకోవచ్చు. టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్‌కు ఇరువైపులా క్రీజ్‌లు ఉన్నాయి కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

అంతే కాకుండా సైడ్ ప్యానల్ లో హంటర్ 350 లోగో కూడా చూడవచ్చు. ఈ బైక్ యొక్క దూకుడును మరింత పెంచడానికి ఫుట్‌పెగ్‌లు మరియు సింగిల్ స్టెప్డ్ సీటు వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో రౌండ్ LED టైల్‌లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్‌లతో పాటు స్ప్లిట్ గ్రాబ్ రైల్ సెటప్ కూడా ఉంటుంది. మొత్తం మీది క్లాసిక్ 350 కంటే చిన్నదిగా ఉన్నప్పటికీ ఆకర్షణీయంగా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్? రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ – ఫీచర్స్

కొత్త టీవీఎస్ రోనిన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది SmartXonnect కనెక్టివిటీ పొందుతుంది. ఈ ఫీచర్ ద్వారా వాహన వినియోగదారులు టర్న్-బై-టర్న్ నావిగేషన్, రేస్ టెలిమెట్రీ, లో ఫ్యూయెల్ వార్ణింగ్, క్రాష్ అలర్ట్ మరియు కాల్ / ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌ వంటి ఫీచర్స్ యాక్సెస్ చేయవచ్చు. కావున ఇది రైడింగ్ సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్? రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఒక అనలాగ్ స్పీడోమీటర్ మరియు ఫ్లోటింగ్ LCD రెండూ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చేర్చబడ్డాయి. డిజిటల్ ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, రెండు ట్రిప్ మీటర్లు, ఫ్యూయల్ గేజ్, ఎకో ఇండికేటర్, సర్వీస్ రిమైండర్ మరియు క్లాక్ అన్నీ సెటప్‌లో ప్రదర్శించబడతాయి, కాగా ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కూడా అదనంగా పొందవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్? రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ – ఇంజిన్

టీవీఎస్ టీవీఎస్ రోనిన్ 225 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి పవర్ మరియు 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 20 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ వరకు ఉంటుంది. రోనిన్ సైలెంట్ స్టార్ట్‌లను అనుమతించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్? రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క పరిధి (రేంజ్) 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ 114కిమీ/గంట.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్? డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఈ రెండు బైకులు మంచి డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ అందిస్తాయి. అయితే ధర పరంగా టీవీఎస్ రోనిన్ కొంత తక్కువగా ఉంటుంది. అయితే తక్కువ ధర వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కావాలనుకునేవారికి హంటర్ 350 మంచి ఎంపిక అవుతుంది. ఈ రెండు బైకులు యొక్క అన్ని ఫీచర్స్ బేరీజు వేసుకుని మీకు నచ్చిన బైక్ ఎంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కథనాల కోసం మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.