రాజకీయాల్లోకి హీరో నితిన్ సోదరి.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్లాన్?

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగిన వారు చాలామంది రాజకీయాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే అందులో అందరూ కూడా అంత ఈజీగా సక్సెస్ కాలేరు. ఇక త్వరలోనే మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో నితిన్ ఫ్యామిలీ నుంచి కూడా ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే..

యువ హీరో నితిన్ ఇటీవల బీజేపీ ప్రముఖ నేత జేపీ నడ్డాను ప్రత్యేకంగా కలుసుకున్న విషయం తెలిసిందే. అయితే అంత హఠాత్తుగా బీజేపీల అధ్యక్షుడిని ఎందుకు కలుసుకున్నారు అనే విషయంలో అనేక రకాలు కథనాలు వెలుపడ్డాయి. మొదట కార్తికేయ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా హీరో నిఖిల్ సిద్ధార్థ ను కలుద్దామని అనుకోగా బిజెపి ప్రముఖులు పొరపాటున నితిన్ ను పిలిచి ఉంటారు అని కామెంట్స్ వచ్చాయి.

ఆ తర్వాత మళ్లీ బీజేపీ ప్రముఖులే మరి కొందరు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇందులో పొరపాటు ఏమి లేదు అని ముందుగా అనుకున్నట్లే హీరో నితిన్ ని పిలిచి జేపీ నడ్డా ప్రత్యేకంగా మాట్లాడీనట్లు వివరణ ఇచ్చారు. అయితే రాజకీయాలకు చాలా దూరంగా ఉండే నితిన్ ఎందుకు ఆరోజు బిజెపి ముఖ్య నేతను కలిశారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు మరొక అంశం కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారుతొంది.

జేపీ నడ్డాను నితిన్ ప్రత్యేకంగా కలవడానికి కొన్ని రాజకీయ కారణాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నితిన్ సోదరి నికితా రెడ్డి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు బీజేపీ ఆఫర్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ముందు నుంచే ఈ తరహా ప్లాన్ తో నిఖిల్ ఫాదర్ కూడా ఆసక్తి చూపించినట్లు కూడా తెలుస్తోంది.

భారత జనతా పార్టీ ఎలాగైనా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలి అని టిఆర్ఎస్ పార్టీపై భారీ మెజారిటీతో గెలవాలని కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీలోనీ కొంతమంది సినీ ప్రముఖులని వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే పలువురికి ఆఫర్ చేయగా నితిన్ కుటుంబ సభ్యులు కూడా ఆసక్తి చూపించినట్లుగా ఒక టాక్ అయితే నడుస్తోంది.

ఇక హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నితిన్ సోదరి నిఖితారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబ సభ్యుల నిర్ణయంతో బీజేపీ ప్రముఖులతో కూడా ఈ విషయంలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే అదే స్థానంలో బిజెపి టికెట్ అందుకోవాలని మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా ప్రయత్నం చేస్తుండగా చివరగా నికితా రెడ్డిని ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.