రష్మిక మందన్నాకు ఆ సమస్య: డాక్టర్ ఫేస్‌బుక్ పోస్టుతో మేటర్ లీక్.. బన్నీకి కూడా అంటూ!

గతంలో కంటే ఇప్పుడు సినిమాల సంఖ్య విపరీతంగా పెరగడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని ప్రేక్షకాదరణను అందుకుంటున్నారు. అలాంటి వారిలో కన్నడ భామ రష్మిక మందన్నా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, అద్భుతమైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన ఈ భామ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక డాక్టర్‌ను కలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక, ‘ఛలో’ మూవీతో తెలుగులోకి వచ్చిన తర్వాత ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని షాకివ్వడంతో పాటు పాపులర్ అయింది.

NTR University: జగన్, రాజశేఖర్‌ రెడ్డిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆ జంతువులతో పోలుస్తూ ఘాటుగా!

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే రష్మిక మందన్నా పేరు మారుమ్రోగిపోయింది. దీనికితోడు ‘ఛలో’ నుంచి మొదలుకొని ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’ వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక‌కు స్టార్‌డమ్‌తో పాటు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది.

ఈ ఏడాది రష్మిక మందన్నా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే మూవీ ఫ్లాప్ అయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘పుష్ప 2’ మూవీ చేయనుంది. అలాగే, ‘మిష‌న్ మ‌జ్ను’ మూవీతో బాలీవుడ్ ఎంటర్ అవుతోంది. అలాగే, అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’ అనే సినిమాలోనూ.. రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘యానిమల్’ మూవీలోనూ నటిస్తోంది.

యాంకర్ శ్రీముఖి ఎద అందాల ప్రదర్శన: షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ రష్మిక మందన్నా తెలుగు సినీ ఇండస్ట్రీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ చిన్నది ‘సీతా రామం’ అనే సినిమా చేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేశాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రష్మిక మళ్లీ ట్రాకులోకి వచ్చింది.

కొంత కాలంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసగా తెలుగు, హిందీ, తమిళంలో సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో తీరక లేకుండా ఎన్నో ప్రయాణాలు కూడా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రష్మిక మందన్నా ఫేమస్ డాక్టర్ గురువా రెడ్డిని కలిసింది. ఈ న్యూస్ బయటకు రావడంతో ఆమెకు అసలేమైందో తెలియక ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

రష్మిక మందన్నా తనను కలిసిన విషయాన్ని డాక్టర్ గురువా రెడ్డి ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు. ఈ మేరకు ఆమెతో దిగిన ఫొటోను షేర్ చేసిన ఆయన.. ‘నువ్వు సామి..సామి.. అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి అని రష్మికకు చెప్పాను. పుష్ప సినిమా చుసిన మొదలు.. రష్మికను కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక, ఇదే పోస్టులో అల్లు అర్జున్ గురించి కూడా డాక్టర్ గురువా రెడ్డి చమత్కరిస్తూ కీలకమైన కామెంట్ చేశారు. ‘బన్నీ కూడా త్వరలో భుజం నొప్పి కారణంతో నా దగ్గరకు వస్తాడు ఏమో’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ డాక్టర్ పోస్టుతో బన్నీ అభిమానులు ఆందోళన చెందుతుండగా.. రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమెకు ఏమీ కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు.