యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు

యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు యమహా గడచిన ఆగస్ట్ నెలలో తమ ప్రోడక్ట్ లైనప్‌లోని కొన్ని ఎంపిక చేసిన మోడళ్లలో కొత్త 2022 మోటోజిపి ఎడిషన్లను విడుదల చేసింది. వీటిలో RayZR స్కూటర్‌లతో పాటు R15M మరియు MT15 మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఈ జాబితాలోకి Areox 155 మాక్సీ స్కూటర్ కూడా వచ్చి చేరింది. ఈ యమహా మోటోజిపి ఎడిషన్ ఏరోక్స్ 155 స్కూటర్‌ని కంపెనీ యొక్క ప్రతిష్టాత్మక రేసింగ్ జట్టు అయిన టీమ్ బ్లూ యొక్క రేసింగ్ మోటార్‌సైకిళ్ల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేయబడింది.

  యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు

ఈ కొత్త 2022 యమహా మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్ ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ దాని స్టాండర్డ్ మోడల్‌తో పోల్చితే, ఇది ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ ని కలిగి ఉంటుంది. ఇందులో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి మెకానికల్ మరియు టెక్నికల్ అప్‌గ్రేడ్స్ లేవు. దేశీయ విపణిలో ఈ కొత్త 2022 యమహా ఏరోక్స్ 155 మోటోజిపి ఎడిషన్ ధర రూ. 1,41,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉంది. కాగా, ఇందులో స్టాండర్డ్ యమహా ఏరోక్స్ 155 స్కూటర్ ధర రూ. 1,39,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉంటుంది.

యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు    ఈ స్పెషల్ ఎడిషన్ యమహా ఏరోక్స్ 155 స్కూటర్ చాలా వరకూ బ్లాక్ థీమ్‌ను కలిగి ఉండి, బాడీపై అక్కడక్కడా బ్లూ కలర్ హైలైట్స్ మరియు మోన్‌స్టర్ ఎనర్జీ బ్రాండ్ లోగోలను కలిగి ఉంటుంది. ఫ్రంట్ వైజర్, ఫ్రంట్ ఆప్రాన్, ఫ్రంట్ మడ్‌గార్డ్, సైడ్ ప్యానెల్‌లు మరియు వెనుక ప్యానెల్‌లపై Yamaha MotoGP బ్రాండింగ్ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది మాన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి ఎమ్1 మోటార్‌సైకిల్ యొక్క కలర్ స్కీమ్ నుండి ప్రేరణ పొందింది. ఇది రేస్ ట్రాక్ పై ఉపయోగించే పాపులర్ యమహా రేస్ మోటార్‌సైకిల్.

యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు ఇది వరకు చెప్పుకున్నట్లుగా యమహా ఏరోక్స్ 155 మోటోజిపి ఎడిషన్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఏమీ లేవు. యమహా ఆర్15 బైక్‌లో ఉపయోగించిన అదే 155సీసీ ఇంజన్‌ను కొద్దిగా రీట్యూన్ చేసి, దానికి సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించి ఈ మాక్సీ స్కూటర్‌లో ఉపయోగించారు. ఇందులోని వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA)తో కూడిన కొత్త-తరం 155సీసీ బ్లూ కోర్, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి 4-వాల్వ్ ఇంజన్ గరిష్టంగా 15.1 బిహెచ్‌పి శక్తిని మరియు 13.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు యమహా అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ ఆర్15 (R15) మాదిరిగానే ఈ ఏరోక్స్ 155 (Aerox 155) స్కూటర్ కూడా అదే ప్లాట్‌ఫామ్ మరియు టెక్నాలజీపై ఆధారపడి తయారు చేయబడింది. ఈ స్కూటర్ ముందు భాగంలో స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. యమహా ఏరోక్స్ 155 యొక్క ఫ్లోర్‌బోర్డ్ డిజైన్ భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర ట్రెడిషనల్ స్కూటర్‌ల మాదిరిగా ఫ్లాట్‌గా కాకుండా నిటారుగా ఉంటుంది, ఇదొక మోటార్‌సైకిల్ లాంటి అనుభూతిని అందిస్తుంది.

యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు యమహా ఏరోక్స్ 155 వెనుక భాగం మొత్తం షార్ప్ డిజైన్‌తో చక్కగా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు చంకీ 140-సెక్షన్ రియర్ టైర్‌తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ మాక్సీ స్కూటర్‌లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో సింగిల్ ఛానల్ ఏబిఎస్, 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వెడల్పాటి 140 మిమీ రియర్ టైర్, బ్లూటూత్ ఎనేబుల్డ్ యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ యాప్, 5.8 ఇంచ్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్ మరియు 24.5 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నాయి.

యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు అంతేకాకుండా, ఈ స్కూటర్‌లో స్కూటర్ లో మెయింటినెన్స్ రిమైండర్స్, చివరిగా పార్క్ చేసిన ప్రదేశం, ఇంధన వినియోగం, మెకానికల్ నోటిఫికేషన్స్ మరియు స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్ వంటి ఇథర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ యాప్ ద్వారా మరిన్ని ఫీచర్లను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మెకానికల్స్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు, ఇరువైపులా 14 ఇంచ్ వీల్స్, ముందువైపు డిస్క్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్, సింగిల్-ఛానల్ ఏబిఎస్ మొదలైనవి ఉన్నాయి.

యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు యమహా అందిస్తున్న ఇతర మోన్‌స్టర్ మోటోజిపి ఎడిషన్లు..

యమహా తమ లైనప్‌లోని ఆర్15ఎమ్, ఎమ్‌టి-15 వెర్షన్ 2.0 మరియు రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మోడళ్లలో కూడా కొత్త 2022 మోటోజిపి ఎడిషన్లను విక్రయిస్తోంది. ఇవి కూడా యమహా యొక్క ప్రత్యేకమైన రేసింగ్ లైవరీతో వస్తాయి. మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

  • ఆర్15ఎమ్ మోటోజిపి ఎడిషన్ – రూ.1.90 లక్షలు

  • ఎమ్‌టి-15 వెర్షన్ 2.0 మోటోజిపి ఎడిషన్ – రూ.1.65 లక్షలు

  • రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మోటోజిపి ఎడిషన్ – రూ.87 వేలు

    (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).