మహిళలు/ చిన్నారులపై నేరాలకు పాల్పడితే అంతే సంగతులు: బిల్లుకు యూపీ అసెంబ్లీ ఆమోదం

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మహిళలు/ చిన్నారులపై నేరాలకు పాల్పడితే ఇకపై బెయిల్ లభించదు. దీనికి సంబంధించిన బిల్లుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్ (అమెండ్‌మెంట్)బిల్ 2022కు ఆమోదం తెలిపింది.

బిల్లు తీసుకొచ్చేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ చొరవ తీసుకున్నారు. సీఆర్పీపీసీ సెక్షన్లలో కీలక మార్పులను ప్రతిపాదించి.. ఆమోద ముద్ర వేయించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ముందుకు బిల్లు గురువారం ఉదయం వచ్చింది. మహిళా సాధికారికత కోసం కృషి చేస్తామని చర్చ సందర్భంగా కామెంట్ చేశారు.

రేప్, గ్యాంగ్ రేప్, లైంగికదాడి జరిగితే ఇకపై బెయిల్ లభించదు. అలాగే చిన్నారులపై లైంగిక దాడి చేసినా అంతే సంగతులు. క్రిమినల్ ప్రొసిజర్ ప్రకారం సెక్షన్ 438, పొస్కొ యాక్ట్ ప్రకారం మార్పులు చేశారు. దీంతో నేరం ఆరోపించిన వ్యక్తికి బెయిల్ లభించదు. మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా ఉండేందుకు కఠిన చట్టం తీసుకొచ్చామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది.

నిందితులు బాధితులను భయపెట్టకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా నిరోధించడంలో ఈ సవరణ మైలురాయిగా నిలవనుంది. దీనిని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని.. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.