బాలికల హాస్టల్‌లో టాయ్‌లెట్‌ను చేతులతో కడిగిన బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా(వీడియో)

భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు జనార్దన్ మిశ్రా రాష్ట్రంలోని ఓ బాలికల పాఠశాలలో టాయిలెట్‌ను తన చేతులతో శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నడుస్తున్న “సేవా పఖ్వాడా”లో భాగంగా యువజన విభాగం ఖత్ఖారీ బాలికల పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేసినట్లు బీజేపీ ఎంపీ ట్వీట్ చేశారు.

పాఠశాల ఆవరణలో చెట్ల పెంపకం కార్యక్రమం అనంతరం ఈ పనిచేశారు బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా. నివేదికల ప్రకారం.. బీజేపీ యువజన విభాగం సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు నుంచి మహాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2 వరకు క్లీనెస్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, మిశ్రా చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాలను సందర్శించారు.

రేవా నియోజకవర్గానికి చెందిన ఎంపీ తన పర్యటనలో బాలికల పాఠశాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రతను గమనించి ఒట్టి చేతులతో స్వయంగా శుభ్రం చేయాలని నిర్ణయించారు.

पार्टी द्वारा चलाये जा रहे सेवा पखवाड़ा के तहत युवा मोर्चा के द्वारा बालिका विद्यालय खटखरी में वृक्षारोपण कार्यक्रम के उपरांत विद्यालय के शौचालय की सफाई की।@narendramodi @JPNadda @blsanthosh @ChouhanShivraj @vdsharmabjp @HitanandSharma pic.twitter.com/138VDOT0n0

పరిశుభ్రత, పరిశుభ్రతను కాపాడుకోవడం ఒకరి కర్తవ్యం – ఇది మహాత్మా గాంధీ, ప్రధాని మోడీ ద్వారా అందించబడిన సందేశమని మిశ్రా తరువాత అన్నారు. ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమంలో తాను పాల్గొనడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు. కాగా, ఎంపీ చేసిన పనిని కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఇలా ఉత్త చేతులతో చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ప్రధాని మోడీ అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ మిషన్ కింద, భారతదేశంలోని అన్ని గ్రామాలు, పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2, 2019 నాటికి 150వ జన్మదినోత్సవం నాటికి తమను తాము “బహిరంగ మలవిసర్జన రహితం”గా ప్రకటించుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, ప్రభుత్వ డేటా ప్రకారం, గ్రామీణ భారతదేశంలో 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి.