ప్రవీణ్ సత్తారు పక్కా ఫర్‌ఫెక్షనిస్టు.. షూటింగ్‌కు ముందే అలా.. సోనాల్ చౌహాన్

అందాల నటి సోనాల్ చౌహాన్ తాజాగా నటించిన చిత్రం ది ఘోస్ట్. నాగార్జున అక్కినేని, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో సోనాల్ చౌహాన్ ఈ సినిమా గురించి, తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడుతూ..

నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. సినిమాల్లోకి వచ్చే ముందు ఎలాంటి ప్లానింగ్, ప్రిపరేషన్ లేదు. నేను సంప్రదాయ రాజ్‌పుత్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే చాలా నేర్చుకొన్నాను. 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి.. ప్రతీ రోజు నిత్య విద్యార్థిగా అన్ని విషయాలు తెలుసుకొన్నాను. చాలా మంచి విషయాలు, చేదు అనుభవాలు అన్నీ ఉన్నాయి.

ది ఘోస్ట్ సినిమాలో నటించిన తర్వాత నటిగా నాకు నేను నేను కొత్తగా అనిపిస్తున్నాను. ఈ సినిమా ద్వారా చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేనిని వదలుకోకూడదనే విషయాన్ని తెలుసుకొన్నాను. నీవు బలంగా ఏదైనా కోరుకొంటే.. ఇక్కడ నీకు ఏం జరగాలో అది జరుగుతుంది.

నన్ను ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్‌గానే చూశారు. ఈ సినిమా తర్వాత నాపై ఉన్న అభిప్రాయం మారిపోతుంది. నాకు ఆఫర్ చేసే పాత్రలు కూడా మారిపోతాయి. ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నా ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మంచి పాత్రలు వస్తాయి.

నాకు డీ గ్లామర్ రోల్‌లో నటించాలని కోరుకొంటున్నాను. పూర్తిగా గ్రామీణ యువతి పాత్రలో నటించాలని కోరుకొంటున్నాను. అలాంటి పాత్రల్లో నేను అందర్ని మెప్పిస్తాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది

టాలీవుడ్‌లో లెజెండరీ యాక్టర్లతో నటించే అవకాశం లభించింది. పెద్ద సినిమాల్లో పెద్ద హీరోల్లో అవకాశం వస్తే.. స్క్రిప్టుకు, నా క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఇస్తాను. నాగ్, బాలయ్య లాంటి వాళ్లు ఉంటే నా కెరీర్‌కు బోనస్ అవుతుంది.

గరుడవేగ, 11th hour విభినమైన, డిఫరెంట్ సినిమాలు ప్రవీణ్ సత్తారు తీశారు. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నేను సినిమా కోసం ట్రైనింగ్ తీసుకొనే సమయానికి స్క్రిప్టు, సినిమాపై పూర్తి అవగాహన కల్పించారు. షూట్ ప్రారంభానికి ముందే.. డైలాగ్స్ వెర్షన్ స్క్రిప్ట్ సీజ్ అయింది. సినిమా గురించి తన మనసులో ప్రతీ ఒక్కటి ఉంటుంది. ది ఘోస్ట్ సినిమాలో 12 యాక్షన్ సీన్లు ఉన్నాయి. దాదాపు 2 పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్లలో నేను నటించాను.