నితీశ్ ప్రధాని పదవి కోసమే – కాగలరా : అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!!

బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా కీలక వ్యాఖ్యలు చేసారు. బీహార్ సీఎం నితీశ్ బీజేపీతో వీడిన తరువాత బీహార్ కు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. నీతీశ్ కుమార్ చాలా మందిని మోసం చేశారని ఆరోపించారు. ప్రధాని పదవి కోసమే నీతీశ్​.. ఆర్జేడీ అధినేత లాలూతో జట్టు కట్టారని అమిత్ షా ధ్వజమెత్తారు. పూర్ణియాలో ఏర్పాటు చేసిన భాజపా ‘జన భావన మహాసభ’లో పాల్గొన్న ఆయన లాలూకి సూచనలు చేసారు. ప్రధాని అయ్యేందుకే నీతీశ్​.. బీజేపీతో తెగదెంపులు చేసుకుని విపక్షాలతో జట్టు కట్టారంటూ విమర్శించారు. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి బిహార్​ సీఎం నీతీశ్ కుమార్ చాలా మందిని మోసం చేశారని దుయ్యబట్టారు.

బీహార్ లో బీజేపీ కాదని నితీశ్ ఏర్పాటు చేసిన మహాగట్ బంధన్​ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆందోళనకర వాతా వరణం నెలకొని ఉందని ధ్వజమెత్తారు. బిహార్​లో విభేదాలు సృష్టించడానికి నేను వస్తున్నానంటూ నితీవ్ – లాలు ప్రచారం చేస్తున్నారని, అందుకు ఈ ఇద్దరు నేతలు ఉన్నారు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. మీ కలయికతో ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన తరువాత భయపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పటానికి తాను వచ్చానని షా వివరించారు. ప్రధాని అయ్యేందుకే లాలూ, కాంగ్రెస్​తో ​జట్టు కట్టారంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు. అదే కాంక్షతో రాజకీయ కూటములు మార్చుతూ నితీశ్ ప్రధాని కాగలుగుతారా అని నిలదీసారు.

ఇప్పుడున్న ప్రభుత్వ బీహార్ ను పాలించగలదా అంటూ ప్రశ్నించారు. నితీశ్ రాజకీయంగా చాలా మందిని మోసం చేసారని, ఇప్పుడు జత కట్టిన లాలు జీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని షా వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మీతోనూ ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉందని హెచ్చరించారు. 2014 లోక్​సభ ఎన్నికలకు ముందు నీతీశ్ కుమార్ పార్టీకి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయని అమిత్​ షా గుర్తుచేశారు. 2025 బిహార్ ఎన్నికల్లో భాజపా పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అమిత్​ షా ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు.