ట్రెండింగ్: ఇద్దరితో డేటింగ్ చేయ్.. చీరకట్టులో జాన్వీ అందాల ఘుమఘుమలు.. శ్రీముఖి హాట్ హాట్‌గా

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు దారుణంగా ఫ్లాప్ టాక్‌ను అందుకొన్నాయి. గతవారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయాలు మీ కోసం..

RRR మూవీ ఆస్కార్ 2023 నామినేషన్‌కు ఎంపికవుతుందని భావించిన సినీ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఛెల్లో షో సినిమా ఇప్పటికే నామినేషన్‌ను సాధించినప్పటికీ RRR ఆస్కార్ నామినేషన్ సాధించే పోటీలో ఉందనే వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. RRR ఎలా నామినేషన్ సాధించే అవకాశం ఉందంటే?

దక్షిణాదిలో ప్రముఖ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత జీవితా రాజశేఖర్ కొన్నేండ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఇటీవల కాలంలో తెలంగాణ పాలిటిక్స్‌లో దూకుడు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాజకీయా్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం జీవితా సేవలను పార్టీకి ఉపయోగించాలనే నిర్ణయం తీసుకొన్నది. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అయితే జీవితా రాజశేఖర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే వివరాల్లోకి వెళితే..

రాయలసీమ చిన్నది స్రవంతి చోకారపు చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. అంతగా గుర్తింపును సొంతం చేసుకోలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం మరింత హైలైట్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యమా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే స్రవంతి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ సొంత బ్యానర్ లక్కీ మీడియాపై నిర్మించిన చిత్రం అల్లూరి. పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈచిత్రానికి నూతన దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. శ్రీవిష్ణు, కాయడు లోహర్ హీరో, హీరోయిన్లు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి హీరో శ్రీ విష్ణు భావోద్వేగంతో మాట్లాడుతూ..

రీసెంట్ గా షారుఖాన్ సతీమణి గౌరీ ఖాన్ తన కూతురు డేటింగ్ చేసే ప్రక్రియలో ఇచ్చే కీలకమైన సలహా ఒకటి ఉంది అంటూ ఆమె ప్రత్యేకంగా వివరణ ఇవ్వడం విశేషం. అందుకు సంబంధించిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళంలో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ మాజీ భార్యగా సోనియా అగర్వాల్‌కు గుర్తింపు ఉంది. 7జీ బృందావన్ కాలనీ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న ఈ అందాల భామ గత కొద్దికాలంగా సింగిల్‌గా ఉంటున్నారు. ఇటీవల సోనియా అగర్వాల్ సోషల్ మీడియా పోస్టు చేసిన ఫోటోలతో మళ్లీ పెళ్లి చేసుకొంటున్నారా? అనే అనుమానాలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తన రెండో పెళ్లిపై ఆమె క్లారిటీ ఇస్తూ..

బొద్దుగా, తనదైన చలాకీ మాటలతో ఆకట్టుకునే శ్రీ ముఖి అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో కూడా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాలేదనే చెప్పాలి. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరిసిన శ్రద్ధా దాస్ తాజాగా అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి పక్కన పెడితో గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కనువిందు చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పెద్దగా ఈ అంశాలపై ఫోకస్ చేసింది లేదు. అయితే అప్పుడప్పుడు రాజకీయ నేతలతో మాత్రం ఏదైనా అత్యవసర సమావేశంలో కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చిరంజీవి కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసిన ఒక ఆడియో వైరల్ గా మారుతోంది ఆయన పాలిటిక్స్ పై గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆడియో షేర్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్లకు భారీ రెస్సాన్స్ రావడంతో ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ భారీ రేంజ్‌లో జరుగుతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో నటించడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. దాంతో పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ బ్రహ్మండంగా జరిగింది. గాడ్‌ఫాదర్ సినిమాకు జరిగిన డిజిటల్ (ఓటీటీ) టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్‌లో జరిగిందంటే?
l

టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి వార్తల్లో ఉండటానికి ఇష్టపడరు. తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌కు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. సినిమా ప్రమోషన్స్, ప్రొఫెషనల్ వర్క్ విషయానికి వస్తే తప్పా మీడియాలో కనిపించరు. అయితే ఇటీవల తనపై వస్తున్న కొన్ని రూమర్లకు తెర దించుతూ తన శ్రీమతి మిహికా బజాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. అయితే తిరుమలలో జరిగిన తమాషా సంఘటన వివరాల్లోకి వెళితే..

కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించేలా ఉంటాయి జాన్వీ కపూర్ హాట్ ఫొటోలు. అయితే గ్లామర్ పిక్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పద్ధతిగా, సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనువిందు చేస్తుంది ఈ భామ. తాజాగా చీరకట్టులో పద్ధతిగా ఎంతో ముద్దుగా దర్శనమిచ్చింది జాన్వీ.

వివరాల్లోకి వెళితే..