టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే..

టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే.. కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ నుండి వచ్చిన వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఖరీదైన క్రెటా ఎస్‌యూవీని కొనుగోలు చేయలేని కస్టమర్లు నేరుగా వెన్యూని ఎంచుకుంటున్నారు. టాటా నెక్సాన్‌తో పోల్చుకుంటే హ్యుందాయ్ వెన్యూ చాలా ప్రీమియంగా కనిపిస్తూ మంచి ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, టాటా నెక్సాన్‌లో లభించే ఈ ఐదు ఫీచర్లను మాత్రం కలిగి ఉండవు. మరి నెక్సాన్‌లో లభిస్తూ, వెన్యూలో మిస్ అయిన ఆ టాప్ 5 ఫీచర్లు ఏవో చూద్దాం రండి.

  టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే..

1. ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM)

పేరుకి తగినట్లుగా ఈ ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ రాత్రివేళల్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా, ఈ ఫీచర్ లేని కార్లలో రాత్రివేళల్లో వెనుకగా వస్తున్న వాహనాల యొక్క హెడ్‌లైట్ కాంతి నేరుగా ఈ మిర్రర్‌పై పడుతుంది. ఇది డ్రైవర్ విజిబిలిటీని దెబ్బతీస్తుంది మరియు అనవసరమైన గందరగోళానికి దారితీస్తుంది. అదే ఈ ఫీచర్ ఉన్న కార్లలో అయితే, వెనుక వైపు నుండి వాహనాల హెడ్‌లైట్ యొక్క కాంతి తగ్గించబడుతుంది. కొన్ని కార్లలో మ్యాన్యువల్ అడ్జస్టబల్ డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా రాత్రిపూట డ్రైవింగ్‌లో ప్రయోజనకరంగా ఉంటాయి.

టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే.. నిజానికి, హ్యుందాయ్ తమ మునుపటి తరం వెన్యూలో ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ని అందించింది. అయితే, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూలో ఈ ఫీచర్ లేదు. దాని స్థానంలో హ్యుందాయ్ మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌ను అందించింది. అయితే, హ్యుందాయ్ వెన్యూలోని మాన్యువల్‌ అడ్జస్టబల్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ పై కంపెనీ యొక్క బ్లూలింక్ టెక్ ఆధారిత అత్యవసర నియంత్రణలను అందిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే.. 2. బ్రాండెడ్ ప్రీమియం ఆడియో సిస్టమ్

టాటా మోటార్స్ చాలా కాలంగా తమ ప్యాసింజర్ కార్లలో ప్రీమియం హర్మాన్ ఆడియో సిస్టమ్‌ను అందిస్తోంది. టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా 4 స్పీకర్లు మరియు 4 ట్వీటర్‌లతో కూడిన 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్‌ ఉంటుంది. ఇది క్యాబిన్‌లో అత్యుత్తమమైన సంగీత అనుభవాన్ని అందిస్తుంది. కాగా, హ్యుందాయ్ వెన్యూలో 4 స్పీకర్లు మరియు 2 ట్వీటర్‌లతో కూడిన ఆడియో సిస్టమ్‌ ఉంటుంది. ఈ రెండింటినీ పోల్చి చూస్తే, టాటా నెక్సాన్ లోని ఆడియో సిస్టమ్ పనితీరు చాలా మెరుగ్గా వినిపిస్తుంది.

టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే.. 3. ఆటోమేటిక్ వైపర్స్

ఒకప్పుడు హై-ఎండ్ లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించిన ఆటోమేటిక్ వైపర్స్ ఫీచర్ ఇప్పుడు ఎంట్రీ లెవల్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌లో భాగంగా, విండ్‌షీల్డ్‌పై ఉండే సెన్సార్లు వర్షం రావడాన్ని లేదా విండ్‌షీల్డ్ నీరు పడటాన్ని గుర్తించి వైపర్లను ఆటోమేటిక్‌గా ఆన్ చేస్తాయి. వర్షాకాలంలో డ్రైవ్ చేసేటప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూలో మాత్రం ఈ ఆటోమేటిక్ వైపర్స్ ఫీచర్ లేదు. అయితే, ఈ రెండు మోడళ్లలో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ ఫీచర్ మాత్రం లభిస్తుంది. ఇది మనం నడిపే వాతావరణ పరిస్థితిని మరియు సూర్యకాంతిని బట్టి హెడ్‌లైట్లను ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యేలా చేస్తుంది.

టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే.. 4. ఎత్తు సర్దుబాటు సీట్‌బెల్ట్‌లు

కార్లలో మనం ఎత్తు సర్దుబాటు చేయగల సీట్ల గురించి తరచూ వింటూ ఉంటాం, కానీ కొన్ని కార్లలో మాత్రమే ఎత్తు సర్దుబాటు చేయగల సీట్ బెల్టులు ఉంటాయి. అలాంటి కార్లలో టాటా నెక్సాన్ కూడా ఒకటి. ఇవి డ్రైవర్ ఎత్తును బట్టి సీట్‌బెల్టును సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇది సీట్‌బెల్ట్ ధరించడాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడమే కాకుండా ప్రయాణీకుల భద్రతను కూడా మెరుగుపరుస్తుంది. హ్యుందాయ్ వెన్యూలో స్టాండర్డ్ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు మాత్రమే లభిస్తాయి.

టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే.. 5. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అంటే చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. ఈ ఫీచర్ ఏంటంటే, సీట్లపై మనం కూర్చునే ప్రాంతంలో వందల సంఖ్యలో చిన్నపాటి రంధ్రాలు ఉంటాయి. ఇవి వేడిని బయటకు పంపడానికి ఉపయోగడుతాయి. ప్రత్యేకించి వేసవి కాలంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఎక్కవ సమయం కూర్చుని డ్రైవ్ చేయడం వలన కలిగి చర్మ సంబంధిత వ్యాధులను కూడా దూరంగా ఉంచడంలో సహకరిస్తుంది. టాటా నెక్సాన్ లోని ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ సీట్లలో వెంటిలేడెట్ సీట్లు లభిస్తాయి. హ్యుందాయ్ వెన్యూలో మాత్రం ఈ ఫీచర్ ఉండదు.

టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే.. ఇక ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్ పెట్రోల్ ఇంజన్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ ‘XE’ వేరియంట్ ధర రూ. 7.59 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతుంది. కాగా, హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్ ఇంజన్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ ‘E’ వేరియంట్ ధరలు రూ. 7.53 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి. టాటా నెక్సాన్‌లో మరొక హైలైట్ ఏంటంటే, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో పాటుగా పూర్తి ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది.