గుడ్ న్యూస్: 5జీ లాంచ్, అక్టోబర్ 1న, ప్రధాని మోడీ చేతుల మీదుగా..

గుడ్ న్యూస్.. 5జీ లాంచింగ్‌పై కేంద్ర టెలికాం శాఖ పేర్కొంది. అక్టోబర్ 1వ తేదీన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారని తెలిపింది. ఆసియాలో గల టెలికాం, మీడియా, టెక్నాలజీని ఐఎంసీలో లో లాంచ్ చేస్తారు. దీనిని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం, సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేస్తారు.

దేశంలో 5జీ లాంచ్ చేస్తామని ఇదివరకే టెలికాం శాఖ పేర్కొంది. తొలుత అహ్మదాబాద్, బెంగళూర్, చండీఘడ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్ నగర్, కోల్ కతా, లక్నో, ముంబై, పుణెలో ప్రారంభిస్తామని తెలిపింది. డబ్యుహెచ్‌వో ప్రతిపాదించన దాని కన్నా 5జీ రెడియేషన్ చాలా తక్కువగా ఉందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సేవలను మరింత విసృతపరచాలని ఇప్పటికే టెలికాం ఆఫరేటర్లను కోరామని మంత్రి తెలిపారు. ఐఐటీ మద్రాస్‌లో 5జీ ల్యాబ్ డెవలప్ చేసిన సంగతి తెలిసిందే. 2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోందని తెలిపారు. దీంతో చాలా మందికి ఉపాధి దొరుకుతుందని కూడా తెలిపారు. రెండు మూడేళ్లలో దేశంలో అన్నీ చోట్ల 5 జీ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

4జీ కన్నా 5జీ వేగం చాలా ఎక్కువ అని ఇదివరకు చాలా సందర్భాల్లో తెలిపారు. వైఫై కన్నా వేగంగా స్పీడ్ ఉంటుందని టెస్ట్ చేసిన సందర్భంలో నిపుణులు తెలిపారు.