ఉద్దవ్‌కు ఊరట.. శివాజీ పార్క్‌ వద్ద దసరా ర్యాలీకి కోర్టు అనుమతి

బాంబై హైకోర్టులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరేకు ఊరట కలిగింది. దసరా సందర్భంగా అక్టోబరు 5వ తేదీన నిర్వహించే బహిరంగ సభకు అనుమతి ఇచ్చింది. సభ నిర్వహణకు అంతకుముందు బృహన్ ముంబై నగర పాలక సంస్థ అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్దవ్ థాకరే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

బీఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై జస్టిస్ ఆర్‌డీ ధనూకా, జస్టిస్ కమల్ ఖాటా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. బీఎంసీ ఆదేశాలు న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. అక్టోబరు 2 నుంచి 6 వరకు శివాజీ పార్కును వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని షరతు విధించింది.

థాకరే తిరుగుబాటు చేసి.. బీజేపీతో ఏక్‌నాథ్ షిండేతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. షిండే సేన- బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా షిండే, డిప్యూటీగా ఫడ్నవీస్ కొనసాగుతున్నారు.