అంతరిక్షంలో అపూర్వ దృశ్యం: భూమికి అత్యంత సమీపానికి గురుడు: ఎప్పుడు, ఎలా చూడొచ్చంటే?

వాషింగ్టన్: అంతుచిక్కని రహస్యాలకు నిలయమైన అంతరిక్షంలో మరో అద్భుత సంభవించబోతోంది. సౌర వ్యవస్థలో అతిపెద్దదైన గురుగ్రహం- భూమికి అత్యంత సమీపానికి చేరుకోనుంది. 59 సంవత్సరాల తరువాత అంటే- 1963 తరువాత ఈ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఆది, సోమవారాల్లో గురుగ్రహం తన వ్యతిరేక దిశను చేరుకున్నప్పుడు ఇది చోటు చేసుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్?: సైన్యం తిరుగుబాటు: ఏం జరుగుతోంది - క్లారిటీ ఏంటీచైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్?: సైన్యం తిరుగుబాటు: ఏం జరుగుతోంది – క్లారిటీ ఏంటీ

ఆ రోజున రాత్రంతా గురుగ్రహం అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది. నేరుగా దీన్ని తిలకించవచ్చు. బైనాక్యులర్లు గానీ అమెచ్యుర్ స్పేస్ ఇన్వెస్టిగేటర్స్ వినియోగించే సాధారణ టెలిస్కోప్‌ను గానీ వినియోగించగలిగితే- గురుగ్రహాన్ని మరింత స్పష్టంగా, అందులో ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్‌ను కూడా చూడటానికి అవకాశం ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

భూఉపరితలం నుంచి చూస్తే- పశ్చిమాన సూర్యుడు అస్తమిస్తోన్న సమయంలో తూర్పు దిక్కున గురుగ్రహం ఉదయిస్తుంది. దీన్నే ఈ గురుగ్రహం భూమికి పూర్తిగా వ్యతిరేక దిశను చేరుకున్నట్లుగా భావిస్తారు. ఇలాంటి అపూర్వ ఘటన 59 సంవత్సరాల కిందట చోటు చేసుకుందని ఇప్పుడు మళ్లీ సంభవిస్తోందని నాసా సైంటిస్టులు చెప్పారు.

సాధారణంగా ప్రతి 13 నెలలకోసారి భూమికి వ్యతిరేక దిశలోకి వస్తుంటుంది గానీ అత్యంత సమీపానికి రావడం మాత్రం 1963 తరువాతఇదే తొలిసారి. దీనికి కారణం లేకపోలేదు. భూమి గానీ, గురుగ్రహం గానీ- రెండూ కూడా ఓ నిర్దేశిత కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమించకపోవడమే. ఫలితంగా- ఈ రెండు గ్రహాలు పరస్పరం పరిభ్రమించే సమయంలో ఇలాంటి వ్యతిరేక దృక్కోణాలు సంభవిస్తుంటాయి.

భూమికి అత్యంత సమీపానికి బృహస్పతి చేరుకోవడం మాత్రం అత్యంత అరుదు. ఆది, సోమవారాల్లో సంభవించబోతోంది. సాధారణం కంటే 11 శాత అత్యంత ప్రకాశవంతంగా.. అంతకుమించి భారీగా కనిపిస్తుందీ సమయంలో. ఈస్టర్న్ టైమ్‌జోన్ ప్రకారం.. సెప్టెంబర్ 25వ తేదీ అంటే ఆదివారం రాత్రి 10 గంటలకు గురుగ్రహం- భూమికి అత్యంత సమీపంగా ఉండే పాయింట్‌కు చేరుకుంటుందని స్పేస్ డాట్ కామ్ తెలిపింది.

ఆ సమయంలో భూమి-గురుగ్రహం మధ్య ఉండే దూరం 59,11,68,168 కిలోమీటర్లు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఇదేననే విషయం తెలిసిందే. భూ వ్యాసార్థంతో పోల్చుకుంటే 11 రెట్లు పెద్దది. భూమి వ్యాసార్థం 12,742 కిలోమీటర్లు. కాగా.. గురుగ్రహం వ్యాసార్థం 1,42,984 కిలోమీటర్లు. సూర్యుడిని ఒక్కసారి చుట్టి రావడానికి గురుగ్రహానికి పట్టే సమయం 12 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరగడానికి తీసుకునే సమయం 10 గంటలే. అత్యంత వేగంగా తన చుట్టూ తాను తిరిగే గ్రహం కూడా ఇదే.