Tollywood Gossips:సమంతను కన్విన్స్ చేస్తున్న ఆ గురువు ఎవరు.. ఎందుకు-ప్రభుదేవపై చిరు ఫ్యాన్స్ గుర్రు..!!

హైదరాబాద్: సమంతా మరో పెళ్లికి రెడీ అవుతోందా.. ప్రభుదేవ పై మెగా ఫ్యాన్స్ ఎందుకు అసంతృప్తితో ఉన్నారు…పొనియన్ సెల్వన్ చిత్రంలో ముందుగా ఐశ్వర్యను అనుకోలేదా.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గాసిప్స్ అండ్ అప్‌డేట్స్ మీకోసం…

A post shared by Samantha (samantharuthprabhuoffl)

సమంతా… ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారింది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత జెస్సీ తన సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఓ వైపు సామాజిక సేవ చేస్తూ మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. తాజాగా సమంతా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

సమంతా మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందంటూ ఓ వార్త షికారు చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ సామ్ రెండో పెళ్లి చేసుకునేందుకు కన్విన్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సద్గురు వాసుదేవ్‌తో సమంతా ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అంతేకాదు సమంతా జీవితంలో మరో అడుగు ముందుకు వేసేందుకు సద్గురు హెల్ప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సామ్ రెండో వివాహం అనే వార్త కేవలం రూమర్‌కే పరిమితం అవుతుందా లేక నిజమౌతుందో చూడాలి మరి…

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవెయిటెడ్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా ఈ మెగా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఆశించనంత స్థాయిలో లేవని ఆచార్య ఫీలవుతున్నారట. రెండు రోజుల క్రితం గాడ్‌ ఫాదర్ సినిమాకు సంబంధించి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కానీ రాజకీయం నానుంచి దూరం కాలేదనే డైలాగ్ రిలీజ్ చేయడంతో తెలుగురాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారితీసింది.

ఇక గాడ్ ఫాదర్ సినిమాలోని థార్ మార్ టక్కర్ మార్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ లిరికల్ వీడియోతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే సంగీత ప్రియులు మాత్రం థమన్ మ్యూజిక్ చిరుకు ఆశించిన స్థాయిలో లేదంటూ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.థార్ మార్ టక్కర్ మార్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి .. సల్మాన్‌ ఖాన్లు కలిసి స్టెప్పులేస్తుంటే అదొక విజువల్ ఫీస్ట్‌లా ఉంది. అయితే ఈ పాటపాడిన శ్రేయా ఘోషల్, కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవపై కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా శ్రేయా ఘోషల్ మెలోడీ సాంగ్స్‌‌కు పెద్ద పీట వేస్తారు.. కానీ ఈ పెప్పీ నెంబర్‌ను ఎంచుకోవడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి సల్మాన్‌ఖాన్‌ లాంటి స్టార్స్ ఉన్నప్పుడు… ప్రభుదేవ తన రేంజ్‌కు తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. శేఖర్ మాస్టర్‌కు ఈ సాంగ్‌ ఇచ్చి ఉంటే… మరో మాస్ లెవెల్‌కు తీసుకెళ్లేవారని అభిప్రాయపడుతున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం నుంచి తాజాగా వస్తున్న చిత్రం పొనియిన్ సెల్వన్. సెప్టెంబర్ 30వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రంలో పెద్ద స్టార్ కాస్టే ఉంది. ఇందులో ఐశ్వర్య రాయ్, విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవితో పాటు మరికొందరు పెద్ద స్టార్లు నటించారు.అయితే రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.అయితే పొనియన్ సెల్వన్ చిత్రంలో నందిని క్యారెక్టర్‌కు ముందుగా ఐశ్వర్య రాయ్‌ను అనులేదని మణిరత్నం చెప్పారు.1990లోనే కమల్‌హాసన్ ఈ చిత్రంలో లీడ్‌రోల్‌లో చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో చేయలేకపోయారు.ఆ సమయంలో నందిని క్యారెక్టర్‌ను రేఖాతో చేయించాలని భావించారట.

ఇక పొనియన్ సెల్వన్ చిత్రం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, శింబు, అమలాపాల్,కీర్తి సురేష్, ఆర్య, అనుష్క శెట్టి లాంటి వారిని మణిరత్నం అప్రోచ్ అయ్యారట.అయితే ఈ చిత్రంలో వీరెవరూ వారి సొంత కారణాలతో నటించలేదు.ఇక పొనియిన్ సెల్వన్ రెండవ భాగం మరో 9 నెలల తర్వాత విడుదల చేయనున్నట్లు చెప్పారు మణిరత్నం. ఇక ఈ చిత్రం మొత్తం బడ్జెట్ 500 కోట్లట..