Slum Dog Husband రవితేజ చేతుల మీదుగా బరాత్ పాట.. కిర్రాక్ ఎక్కిస్తున్న పెళ్లి సాంగ్

నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమకు పరిచయమైన సంజయ్ రావు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్న సంజయ్ రావు హీరోగా మరో చిత్రం తెరకెక్కుతున్నది. మైక్ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న కామికల్ ఎంటర్‌టైనర్ స్లమ్ డాగ్ హజ్బెండ్. ప్రణవి మానుకొండ హీరోయిన్‌గా నటిసున్న ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమా నుంచి బరాత్ సాంగ్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. బరాత్ పాటలో చాలా జోష్ ఉంది. పాటతో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలి అని రవితేజ్ మూవీ టీమ్‌కు విషెస్ తెలియజేశారు. లచ్చి గాని పెళ్లి ఇగ పార్శిగుట్టల లొల్లి. లచ్చిగాని పెళ్లి నువు మర్పా కొట్టర మళ్లీ అంటూ సాగే ఈ పాట బరాత్ సాంగ్ ఆఫ్ ప్రజెంట్ టైమ్స్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా..భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి పాడారు. బరాత్ సందడి, ఉత్సాహం అంతా ఈ పాటలో కనిపించింది.

నటీనటులు: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు
రచన దర్శకత్వం: డాక్టర్ ఏఆర్ శ్రీధర్.
నిర్మాతలు: అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
ఎడిటర్: వైష్ణవ్ వాసు
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ జే రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి
పీఆర్వో: జీఎస్కే మీడియా
లైన్ ప్రొడ్యూసర్: రమేష్ కైగురి