Rasi Phalalu (24th Sep 2022) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. వ్యాపార, ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరోబాధను కలిగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలలో వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.