Priyanka Chopra కూతురితో కలిసి తొలిసారి విహార యాత్ర.. ఫోటో ఎంత ముద్దుస్తుందో.. !

హాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రా కాస్త సమయం తీసుకొని విహార యాత్రకు టైమ్ కేటాయించింది. తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ సిటీకి వెళ్లింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సమావేశానికి హాజరు కావడానికి వెళ్లిన ప్రియాంక తన కూతురు మల్టీ మేరీతో కలిసి అద్భుతమైన క్షణాలను ఆస్వాదించింది. తన కూతురుతో కలిసి ఇలా విహారయాత్రకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం న్యూయార్క్‌లో కూతురుతో కలిసి పార్కులో నడిచి వెళ్లిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.. దాంతో అభిమానులు ఈ ఫోటోకు లైక్ కొట్టి కామెంట్లు పెట్టారు. పార్కులో నా కూతురితో వాక్ అని కామెంట్ చేసింది. ఫోటోలో నలుపు కళ్లద్దాలతో చేతిలో బిడ్డతో దర్శనమిచ్చింది.

గతేడాది ప్రియాంక చోప్రా దంపతులకు మల్టీ మేరి పుట్టింది. నెలలు నిండకుండా పుట్టడంతో చాలా నెలలు హాస్పిటల్‌లో ఉంచారు. బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎదిగిన తర్వాత కూతురుని ప్రియాంక ఇంటికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి బిడ్డ బాగోగులు చూసుకొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నది.

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు ప్రేమలో పడ్డాక.. కొద్ది నెలలు డేటింగ్ చేశారు.2018లో వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో బిడ్డకు జన్మను ప్రసాదించారు.

ప్రియాంక చోప్రా 2015లో క్వాంటికో అనే టెలివిజన్ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆమె బేవాచ్ లాంటి మూవీస్ నటించింది. ఇటీవల ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూసో బ్రదర్స్ రూపొందించిన సిటాడెల్ చిత్రంతో ప్రియాంక అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ , జీ లే జరా చిత్రాల్లో నటిస్తున్నది.