Oke Oka Jeevitham Collections: 2 వారాల్లోనే అన్ని కోట్లు.. శర్వానంద్ మరో రికార్డు.. లాభం ఎంతంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే తనదైన నేచురల్ యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో విజయాలను అందుకోలేకపోయిన శర్వానంద్.. ఇటీవలే ‘ఒకే ఒక జీవితం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఒకే ఒక జీవితం’ 2 వారాల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

శర్వానంద్ – శ్రీ కార్తీక్ కాంబినేషన్‌లో వచ్చిన టైం ట్రావెల్ మూవీనే ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అయింది.

క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

యంగ్ హీరో శర్వానంద్‌కు ఆంధ్రా, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో ‘ఒకే ఒక జీవితం’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ అయింది.

శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. దీంతో రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. అయితే, ఇప్పుడు క్రమంగా దీనికి వసూళ్లు పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో ‘ఒకే ఒక జీవితం’ మూవీకి 14వ రోజు రూ. 8 లక్షలే వసూలు అయ్యాయి.

అనసూయ అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా!

శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’కు 9 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 54 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 75 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 6.33 కోట్లు షేర్, రూ. 10.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

ఏపీ, తెలంగాణలో 2 వారాల్లో రూ. 6.33 కోట్లు వసూలు చేసిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 55 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.02 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 14 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.15 కోట్లు షేర్‌, రూ. 24.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

టైం ట్రావెల్ కథతో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.15 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.15 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో టాలెంటెడ్ గాయ్ శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ 2 వారాల్లోనే రూ. 10.15 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఈ మార్కును అందుకున్న చిత్రంగా రికార్డును నమోదు చేసుకుంది. అంతేకాదు, లాభాల పరంగానూ రెండు కోట్ల మార్కును కూడా చేరుకుంది. ఫలితంగా శర్వానంద్ ఖాతాలో ఒకేరోజు రెండు రికార్డులు వచ్చినట్లు అయింది.