Krishna Vrinda Vihari Twitter Review: నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి ట్విటర్ రివ్యూ.. అది తక్కువైందట..

ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి సినిమాలతో హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వరుడు కావలెను సినిమాతో పలకరించిన నాగ శౌర్య తాజాగా నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. పాపులర్ సింగర్ షెర్లీ సేథియా హీరోయిన్ గా తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఈ మూవీ ఇవాళ అంటే సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాపై నెటిజన్ల స్పందన ఎలా ఉందనేది కృష్ణ వ్రింద విహారి ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

రష్మిక మందన్నా టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన ఛలో మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. విభిన్నమైన సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల కాలంలో కొన్ని ఫ్లాప్స్ చూసిన నాగ శౌర్యకు వరుడు కావలెను సినిమా కొంతవరకు ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు. అయితే ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు హీరో నాగ శౌర్య.

ఈ క్రమంలోనే నాగ శౌర్య తాజాగా నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది పాపులర్ సింగర్ షెర్లీ సేథియా. రొమాంటిక్-కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ కృష్ణ వ్రింద విహారి మూవీ నేడు అంటే సెప్టెంబర్ 23న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ షోస్ చూసిన సినీ లవర్స్, నెటిజన్స్ ట్విటర్ వేదికగా నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారిపై రివ్యూస్ ఇస్తున్నారు.

#KrishnaVrindaVihari Overall A Below Par Rom-Com that ends up as a mostly unsatisfactory watch apart from a few comedy scenes!

Movie runs on a flat note and the screenplay falters big time with a very boring love track/drama. Few comedy scenes and setup work

Rating: 2.25-2.5/5

”కృష్ణ వ్రింద విహారి చిత్రం ఓవరాల్ గా సంతృప్తికరంగా లేని హాస్య సన్నివేశాలతో ముగుస్తుంది. బిలో రొమాంటిక్-కామెడీ వాచ్. ఒక ఫ్లాట్ నోట్ పై సాగే ఈ మూవీ కథ, కథనం చాలా స్లోగా నడుస్తుంది. బోరింగ్ లవ్ ట్రాక్, డ్రామాతో స్క్రీన్ ప్లే చాలా వరకు తడబడింది. కొంతవరకు మాత్రమే కామెడీ వర్కౌట్ అయింది” అంటూ ఓ యూజర్ 2.25-2.5 రేటింగ్ ఇచ్చారు. ఇక మరొక యూజర్ అయితే సెకండాఫ్ కాన్సెప్ట్ అదిరిపోయిందని.. నవ్వుతున్న, ఫైర్ ఎమోజీస్ యాడ్ చేసి రివ్యూ ఇచ్చారు.

ఇక మరికొందరి రివ్యూ ప్రకారం కృష్ణ వ్రింద విహారి చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. కథ పాతదే అయినా, స్క్రీన్ ప్లే బాగుందంటున్నారు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ స్టోరీని మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. హీరోయిన్ షెర్లీ సేథియా అందంగా కనిపించిందని, ఎప్పటిలాగే నాగ శౌర్య కూల్ నటనతో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఇక వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ బాగున్నాయని, ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుందంటున్నారు.

సినిమా కథ ఇంకాస్తా బలంగా రాసుకుంటే బాగుండేదని మరికొంతమంది అంటున్నారు. ఫస్ట్ హాప్ మొత్తం లవ్ ట్రాక్ పైనే సాగిందని, కానీ కామెడీ సీన్లు బాగున్నాయని చెబుతున్నారు. అనీష్ కృష్ణ తన మార్క్ చూపించాడని రివ్యూస్ వస్తున్నాయి. అలాగే మహతి స్వర సాగర్ మ్యూజిక్ చాలా బాగుందని కొనియాడుతున్నారు. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ కాకపోయిన పాజిటివ్ గానే టాక్ వస్తుంది.