Janaki Kalaganaledu September 23rd: జెస్సి అవతారం చూసి జ్ఞానాంబ షాక్.. మరో కొత్త టెన్షన్ స్టార్ట్!

జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథాంశంతో మరో మలుపు తిరిగింది. రామచంద్ర సహకారంతోనే అతని భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకున్న జానకికి అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 395 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మొత్తానికి జానకి మాట ఇచ్చినట్లుగానే జెస్సి అఖిల్ పెళ్లి చేస్తుంది. మొదట జానకి మాటలు అత్త జ్ఞానాంబ నమ్మకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత జానకి కుటుంబం కోసం ఆలోచించిన విధానం చూసి ఎంతగానో మెచ్చుకుంటుంది. అఖిల్ తప్పు చేసి జెస్సి కి గర్భం వచ్చేలా చేస్తాడు. అయితే ఆ తర్వాత తల్లికి భయపడి ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడు. జానకి ఎంత చెప్పినా కూడా తల్లి కూడా నమ్మదు. కానీ ఆ తర్వాత జానకి అఖిల్ మాట్లాడుకుంటున్న మాటలు విన్న తర్వాత జ్ఞానాంబ అసలు విషయం తెలుసుకుంటుంది. ఇక తర్వాత తన ఆలోచన విధానంతోనే అఖిల్ జెస్సి పెళ్లి చేయాలనే డిసైడ్ అవుతారు.

అయితే అఖిల్ జెస్సి పెళ్లి అయిన తర్వాత మరొక విధంగా జెస్సి ఆలోచిస్తుంది. అసలు నేను కడుపుతో నీ కారణంగా ఎంతో బాధపడ్డాను. మా తల్లిదండ్రులు కూడా అవమానంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చూసిన చూపులు నన్ను ఇంకా బాధపెడుతున్నాయి. అలాంటి సమయంలో నువ్వు సపోర్ట్ గా ఉంటావు అనుకుంటే మాటలు మార్చి నన్ను మోసం చేయాలని అనుకున్నావు అంటూ జెస్సి అఖిల్ తో మాట్లాడుతుంది. అంతేకాకుండా నాకు నీ మీద నమ్మకం పోయింది అంటూ మళ్ళీ ఆ నమ్మకం రావాలంటే చాలా కష్టమని మనం కేవలం సమాజానికి మాత్రమే భార్యాభర్తలము కానీ గదిలోకి వచ్చాక నువ్వు ఎవరో నేను ఎవరో అంటూ జెస్సి తన ఆవేదనను కోపం రూపంలో తెలియజేస్తుంది. అయితే జెస్సిని ఎలాగైనా కన్విన్స్ చేయాలి అని తన కోపం తగ్గేలా చేయాలి అని అఖిల్ బ్రతిమాలతాడు. ఆఖరికి కాళ్ల మీద కూడా పడతాను అని అంటాడు. ఇక చివరికి కౌగిలించుకోవడంతో జెస్సి కూడా అప్పుడే సైలెంట్ అవుతుంది.

ఇక మరోవైపు జ్ఞానాంబ జానకి విషయంలో ఆలోచిస్తున్న విధానం తప్పు అని ఆలోచిస్తుంది. అనవసరంగా తనకు ఇచ్చిన ఐదు అవకాశాలలో పొరపాటున ఒక అవకాశాన్ని కొట్టేశాను అని అనుకుంటుంది. ఇక తర్వాత తనకు ఇచ్చిన ఐదు అవకాశాలకు గాను ఐదు అంకెలలో ఒక అంకె కొట్టేసిన విధానం తప్పు అని మళ్లీ ఆ అంకెను సరి చేయాలి అని అనుకుంటుంది. కానీ గోడ మీద ఎంత తుడిచినా కూడా ఆ మరక అలానే ఉంటుంది. అయితే అప్పుడే గోవిందరాజులు వచ్చి ఒక్కసారి నువ్వు చేసిన తప్పు ఆలోచన అంత ఈజీగా వెనక్కి రాదు అని ఉంటాడు. ఇక తర్వాత తల్లిదండ్రుల మాటలు విన్న రామచంద్ర కూడా కొంత బాధపడతాడు.

అయితే జానకి ఇంకా పూర్తిస్థాయిలో తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని ఆమె విషయంలో ఇంకా సంతృప్తిగా లేను అని జ్ఞానాంబ అంటుంది. ఎందుకంటే జానకి ఒక వైపు చదువుకుంటూనే మరొకవైపు ఇంటి బాధ్యతను కూడా కరెక్ట్ గా చూసుకోవాలి కానీ తనను కలలు కన్నా ఐపిఎస్ చదువును పట్టించుకోవడం లేదు అని జ్ఞానాంబ అనుకుంటుంది. ఇక విషయంవిన్న రామచంద్ర మళ్లీ జానకి చదువుపై దృష్టి పెట్టే విధంగా మాట్లాడతాడు. ఆమెకు స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడుతాడు. ఇక జానకి కూడా భర్త చెప్పినట్లుగా మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాలని అనుకుంటుంది.

ఇక జెస్సి ఉదయం లేవగానే టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని రావడం మల్లిక గమనిస్తుంది. ఈ విషయం వెంటనే అత్తగారికి చెప్పి ఆమె సంప్రదాయాలను పద్ధతులను పాటించడం లేదని చెప్పాలి అని ఆ తర్వాత జానకిని తిట్టించాలని కూడా మల్లిగా ఆలోచిస్తుంది. ఇక ఆ తర్వాత జ్ఞానాంబ జానకిని పిలిచి అందరి ముందు మాట్లాడుతుంది. ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు కొన్ని ఆచారాలు పద్ధతులు పాటించాలి అని ఆ బాధ్యత కూడా నువ్వే చూసుకోవాలి అని జెస్సిని చూసి చెబుతోంది.

ఇక తర్వాత జెస్సికి అర్థమయ్యే విధంగా జానకి చెబుతుంది. తాను కావాలని ఈ బట్టలు వేసుకోలేదని ఇంటి నుంచి కట్టు బట్టలతో వచ్చాను కాబట్టి ఉదయం లేవగానే అఖిల్ డ్రెస్ వేసుకున్నట్లు చెబుతుంది. ఇక జానకి తన దగ్గర ఉన్న చీరలు ఇస్తుంది. అనంతరం అందరూ భోజనం చేస్తూ ఉండగా జెస్సి తల్లిదండ్రులు కూడా వస్తారు ఆరోజు కోపంగా మాట్లాడిన దానికి క్షమాపణలు చెబుతున్నామని జరిగినవి మనసులో పెట్టుకోవద్దని అంటారు. అలానే మా ఆచారం ప్రకారం పెళ్లి అయిన తరువాత నాన్ వెజ్ తో విందు ఏర్పాటు చేస్తామని అంటారు. నాన్ వెజ్ తినని జ్ఞానాంబ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఇంట్లో పూజ ఉండడంతో జెస్సి కూడా సహాయం చేయాలని అనుకుంటుంది కానీ అప్పుడే అక్కడ ఉన్న హారతి తగిలి ఒకరి చీర కాలుతుంది. మరి జెస్సి పొరపాటుకు ఆమె తల్లిదండ్రుల నాన్ వెజ్ విందు భోజనం కు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.