Girlfriend: ఉద్యోగాల కోసం సిటీకి లవర్స్, ప్రియురాలి ఇంట్లో శవమైన ప్రేమికులు, రాత్రి ఏం జరిగింది?

బెంగళూరు/ఆనేకల్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. చిన్నప్పటి నుంచి కలసిమెలసి చదువుతున్న యువతి, యువకుడు తరువాత ప్రేమించుకున్నారు. ఉద్యోగం కోసం ఇద్దరూ ఐటీ హబ్ చేరుకుని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. యువతి ఉద్యోగానికి రాకపోవడం, ఫోన్ చేసినా ఆమె రిసీవ్ చెయ్యకపోవడంతో ఆమె ఫ్రెండ్ కు అనుమానం వచ్చి ఆమె ఇంటి దగ్గరకు వెళ్లారు.

ఎంతసేపు పిలిచినా తలుపులు తియ్యకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూడగా బెడ్ మీద ప్రియురాలుశవమై కనిపించడం, ప్యాన్ వేలాడుతూ ప్రియుడు శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు.

Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో?Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో?

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని కేఆర్ పేట్ తాలుకాలోని చౌడ సముద్రం గ్రామంలో మల్లికార్జున్ (27) అనే యువకుడు, నేత్రావతి (23) అనే యువతి నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి మల్లికార్జున్, నేత్రావతి ఒకే స్కూల్ లో, ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి మల్లికార్జున్, నేత్రావతితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు చాలాక్లోజ్ గా ఉంటున్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం మల్లికార్జున్, నేత్రావతి చనువు పెంచుకుని ప్రేమలో పడ్డారు. ప్రేమికులు మల్లికార్జున్, నేత్రావతి హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. చదువు పూర్తి చేసుకున్న తరువాత మొదట మల్లికార్జున్ బెంగళూరు చేరుకుని ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం చేస్తున్న మల్లికార్జున్ వారంవారం సొంత ఊరికి వెళ్లి అతని ప్రియురాలు నేత్రావతిని కలుస్తున్నాడు.

కొంతకాలం తరువాత నేత్రావతి కూడా బెంగళూరు చేరుకుని ఆనేకల్ సమీపంలోని హెబ్బగుడిలో నివాసం ఉంటూ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగాల కోసం ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్న ప్రేమికులు మల్లికార్జున్, నేత్రావతి వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయితే వీలు చిక్కినప్పుడు మల్లికార్జున్, నేత్రావతి కలుసుకుని హ్యాపీగా ఉంటున్నారు.

నేత్రావతి ఉద్యోగానికి రాకపోవడం, ఫోన్ చేసినా ఆమె రిసీవ్ చెయ్యకపోవడంతో ఆమె ఫ్రెండ్ కు అనుమానం వచ్చి హెబ్బగుడిలోని ఆమె ఇంటి దగ్గరకు వెళ్లారు. ఎంతసేపు పిలిచినా నేత్రావతి తలుపులు తియ్యకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా బెడ్ మీద ప్రియురాలు నేత్రావతి శవమై కనిపించింది.

పక్కరూమ్ లోనే నేత్రావతి ప్రియుడు మల్లికార్జున్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు. ఈనెల 19వ తేదీన తన ప్రియురాలు నేత్రావతిని కలసి వస్తానని చెప్పి వెళ్లిన మల్లికార్జున్ తరువాత ఎవ్వరి అందుబాటులోకి రాలేదని అతని స్నేహితులు అంటున్నారు.

ప్రియురాలితో గొడవపడిన మల్లికార్జున్ నేత్రావతిని హత్య చేసి తరువాత ఆత్మహత్య చేసుకున్నాడా ?, లేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా ? అని కచ్చితంగా తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని బెంగళూరు గ్రామీణ జిల్లా పోలీసులు తెలిపారు. మొత్తం మీద ప్రేమికులు ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చి ఇద్దరి జీవితాలు అంతం చేసుకోవడంతో వారి సొంత గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.