Calcium: కాల్షియం లోపం ఉందా.. అయితే ఈ పని చేయండి..

శరీరానికి అనేక పోషకాలు అవసరం ఉంటాయి. అందులో కాల్షియం ఒకటి. అయితే చాలా మంది కాల్షియం లోపం వల్ల బాధుపడుతుంటారు. 70 శాతం ఎముకలు కాల్షియం, ఫాస్ఫేట్ తోనే తయారవుతాయి. ఎముకలను బలంగా ఉంచుకోవడానికి కాల్షియాన్ని పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు చూచిస్తున్నారు. మారుతున్న అలవాట్ల కారణంగా చాలా మందిలో కాల్షియ లోపం తలెత్తుతుంది. అందుకే కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి.

చిగుళ్ళ నొప్పి
కాల్షియం లోపం వల్ల చర్మం పొడిబారుతుంది. అలాగే గోళ్ల ఎదుగుదల తగ్గిపోతుంది. దంతాలు బలహీన పడతాయి. ఎముకలు కూడా బలహీనమవుతాయి. కాల్షియం లోపం వల్ల చిగుళ్ళ నొప్పి, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయట. చేతుల్లో, కాళ్ళలో నొప్పి వస్తుంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా ఉదయం లేవగానే ఎముకల్లో తిమ్మిరిగా అనిపిస్తాయి. కాల్షియం లోపం వల్ల కొన్నికొన్ని సార్లు చేతులు, పాదం, కాలు, నోటి చుట్టూ కూడా తిమ్మిరి ఏర్పడుతుందట.

ఈ పదార్థాలు తీసుకోవాలి
విటమిన్‌-డి అనేది కాల్షియం శోషణలో మెరుగ్గా పనిచేస్తుంది. పుట్టగొడుగులలో విటమిన్‌-డి పుష్కలంగా ఉంటుంది.అందుకే పుట్టగొడుగులు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. వీటిద్వారా కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కార్బొనేటెడ్‌ పానీయాలకు బదులుగా ద్రాక్ష, జామ తదితర పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్‌-సి అందుతుందట. బాదం, ఓట్‌మీల్‌, బ్రెజిల్‌ నట్స్‌ వంటివి తరచూ తీసుకోవాలి. వీటిని తిన్నప్పుడల్లా 100 మిల్లీగ్రాముల క్యాల్షియం శరీరానికి అందుతుందట

జున్న
జున్న తీసుకోవడం వల్ల కూడా కాల్షియం లభిస్తుంది. అరకప్పు పాలతో వచ్చేంత కాల్షియం చిన్న జున్ను ముక్కలో ఉంటుందట. పాలకూర, క్యాబేజీ, బచ్చలికూరలో కాల్షియం అధికంగా ఉంటుందట. వీటిని తరచూ తినడం వల్ల మనకు అవసరమైనదానిలో 25% మేర కాల్షియం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 19-50 సంవత్సరాల వయసులోని మహిళలకు రోజుకు 1000-1200 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరమని చెబుతున్నారు. కాల్షియం ఎక్కువ ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.