Bigg Boss Telugu 6: షో కోసమే వాళ్ల లవ్.. నోరు జారిన కంటెస్టెంట్.. బయటపడ్డ బిగ్ బాస్ స్కెచ్

తెలుగు బుల్లితెర మీద చాలా రకాల కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అయితే, అందులో అన్నీ సక్సెస్ కావడం లేదు. జనరంజకంగా సాగే కొన్ని షోలు మాత్రమే ఆదరణను అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు చేరువ అయిన ఈ కార్యక్రమం.. తెలుగులో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇటీవలే నిర్వహకులు ఆరో దాన్ని కూడా మొదలు పెట్టేశారు. ఇందులో చాలా మంది ఫోకస్ అయినా.. ఇద్దరు మాత్రం జంటగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ జంట బండారం బయట పడింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

బిగ్ బాస్ షో తెలుగులో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో కంప్లీట్ చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, రేటింగ్ మాత్రం తగ్గిపోతూనే ఉంది.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

చాలా మంది ప్రేక్షకులు బిగ్ బాస్ షోను ఇష్టపడడానికి అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా ఒక కారణం అనే చెప్పాలి. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో హైలైట్ అయ్యారు.

బిగ్ బాస్‌లో కనిపించే లవ్ ట్రాకులపై ఎంతో ఫోకస్ ఉంటుంది. చుట్టూ వందల కెమెరాలు ఉన్నా.. చాలా మంది రొమాంటిక్‌గా కనిపిస్తూ తమ తమ ప్రేమలను వ్యక్త పరచుకుంటూ ఉండడం ప్రేక్షకులకు కావాల్సినంత మజాను పంచుతోంది. ఇక, ఆరో సీజన్‌లో ఇప్పటికే పలువురిని జంటలుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువగా అదే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు.

క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు వచ్చినా అందులో ఒకటో, రెండో ప్రేమజంటలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్‌లో కూడా కొందరినీ జంటలుగా మార్చడానికి మొదటి రోజు నుంచే టాస్కులు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్‌ మధ్య లవ్ ట్రాకును చూపించేలా బిగ్ బాస్ టీమ్ విశ్వ ప్రయత్నాలే చేస్తుందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు వచ్చారు. అందులో శ్రీ సత్య చాలా హైలైట్ అయింది. ఎంతో అందంగా ఉండే ఈ చిన్నదానికి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక, శ్రీ సత్యను పడేయడానికి అర్జున్ కల్యాణ్ తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్లాన్లు చేస్తున్నాడు. కానీ, ఆమె మాత్రం అతడిని లైట్ తీసుకుంటూనే ఉంటోంది.

అనసూయ అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా!

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నేహా చౌదరి ‘అసలు శ్రీ సత్య, అర్జున్ మధ్య ఏముంది’ అని శ్రీహాన్‌ను ప్రశ్నించింది. దీనికతడు ‘నాకు తెలిసినంత వరకూ.. వాడికి ఆ అమ్మాయి మీద ఏదో ఫీలింగ్ ఉంది.. కానీ చెప్పడంలేదు. ఆ పిల్ల మాత్రం బ్రదర్ అని పిలవనా అని అడుగుతుంది. దీనికి మనోడు ఏమీ మాట్లాడడం లేదు. పైగా తను ఏం చేసినా వావ్ అంటాడు’ అని చెప్పుకొచ్చాడు.

శ్రీహాన్ మాటలకు నేహా చౌదరి స్పందిస్తూ.. ‘మరి వసంతితో కూడా అర్జున్ అలాగే ప్రవర్తిస్తున్నాడు కదా.. ఏంటి ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీనా? డబుల్ గేమ్ నడుస్తుందా? ఏంటి ఇక్కడా? అసలేం అర్థం కావట్లేదు. ఒక్కోసారి వీళ్లిద్దరూ షో కోసం కూడా చేస్తున్నారేమో అనిపిస్తోంది’ అని నోరు జారింది. దీంతో షోలో కావాలనే ట్రాకులు పెట్టుకుంటారన్న వాదనకు బలం చేకూరినట్లైంది.