Bigg Boss Telugu 6:బిగ్ బాస్ పై శ్రీ సత్య చిరాకు.కీర్తిని చూసి సిగ్గుపడతాడు అంటూ ఆడేసుకున్న లేడీ కంటెస్టెంట్లు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్లుగా.. అడవిలో ఆట గేమ్ లో భాగంగా అత్యాశ వ్యాపారస్తురాలిగా చేసిన గీతూ రాయల్, బంగారు కొబ్బరు బొండం తన వద్ద ఉంచుకున్న పోలీసు శ్రీ సత్య, పోలీసు టీమ్ లో ఇద్దరు బెస్ట్ పర్ఫార్మర్లుగా ఆది రెడ్డి, ఫైమా.. దొంగల బృందంలోని ఒక బెస్ట్ పర్ఫార్మర్ గా శ్రీహాన్ సెలెక్ట్ అయ్యారు. వీరికి రెండు లెవెల్స్ లో బ్రిక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బ్రిక్స్ ను పేర్చడం.. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ వాటిని బాల్స్ తో కొడుతూ కూల్చే ప్రయత్నం చేస్తే కాపాడుకోవడం వంటి రెండు దశలు ఉన్నాయి. ఈ టాస్క్ లో భాగంగా అసహనం కోల్పోయిన శ్రీ సత్య బిగ్ బాస్ పై చిరాకు పడింది.

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్లుగా గీతూ రాయల్, శ్రీ సత్య, ఆది రెడ్డి, ఫైమా, శ్రీహాన్ ఎంపిక అయ్యారు. టాస్క్ మొదలవ్వగానే జోరుగా ఆట మొదలెట్టారు. అయితే గీతూ రాయల్ బ్రిక్స్ పరిగెత్తుకుంటూ వచ్చి పెట్టడానికి బదులు.. అక్కడి నుంచే విసిరియడంతో డిస్ క్వాలీఫై చేశాడు సంచాలక్ గా వ్యవహరించిన సింగర్ రేవంత్. తర్వాత చాలా కష్టపడుతూ ఫైమా, శ్రీ సత్య, ఆది రెడ్డి, శ్రీహాన్ బ్రిక్స్ పేర్చారు.

తర్వాత రెండో ఫేజ్ లో భాగంగా మిగతా ఇంటి సభ్యులు బాల్స్ తో బ్రిక్స్ ను కూల్చే ప్రయత్నం చేస్తే వాటిని కాపాడుకోవాలి కెప్టెన్సీ కంటెండర్లు. శ్రీహాన్, శ్రీ సత్య, ఫైమా, ఆది రెడ్డిల బ్రిక్స్ లను బాల్స్ తో కొడుతూ కూల్చే ప్రయత్నం చేశారు మిగతా హౌజ్ మేట్స్. అయితే ఈ క్రమంలో కంటెండర్లుకు ఇంటి సభ్యుల విసిరే బాల్స్ చాలా గట్టిగానే తాకాయి. ఇదే ఛాన్స్ గా భావించి వారిపై ఉన్న కోపాన్ని చూపించారనేది తెలియదు.

తనను కావాలనే గట్టిగా కొట్టారని, వాళ్లు ఎవరో నాకు తెలియాలి గానీ.. అంటూ శ్రీహాన్ అన్నాడు. అబ్బా తలపై కొడతావేంటీ రాజ్ అంటూ ఫైమా తన బాధ చెప్పుకుంది. ఇక శ్రీ సత్యకు అయితే బాల్స్ దెబ్బలు కొంచెం గట్టిగానే తాకినట్టున్నాయి. దీంతో కొడుతున్నారు.. అనుకుంటూనే తగిలే దెబ్బలకు అరిచింది శ్రీ సత్య. ఇలా కంటిన్యూగా దెబ్బలు తాకడం, బ్రిక్స్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ”బజర్ మోగించడయ్యా బిగ్ బాస్” అంటూ చిరాకు పడినట్లు తెలుస్తోంది. కొంచెం అసహనంతో అలా అన్నట్లు కనిపిస్తుంది.

ఇంతకుముందు కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఆడిన అడవిలో ఆట గేమ్ లో గీతూ రాయల్ రూల్స్ పెట్టుకుని ఆడే విధానంపై స్పందిస్తూ బిగ్ బాస్ కు, నాగార్జునకు ఇన్ డైరెక్ట్ గా శ్రీ సత్య చురకలు అంటించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే కెప్టెన్సీ కంటెండర్ల మొదటి లెవెల్ పూర్తి అయింది. ఆ తర్వాత కెప్టెన్ రాజ్ ను శ్రీసత్యతోపాటు మిగతా మహిళా సభ్యులు ఒక ఆట ఆడుకున్నారు. రాజ్ ఎవర్నో చూస్తూ సిగ్గు పడుతాడు.. ఎవరు వాళ్లు అని ప్రశ్నిస్తారు.

దానికి అలా ఏం లేదంటాడు రాజ్. అయితే హౌజ్ లో పెళ్లి కానీ ఒక్కొక్క అమ్మాయిపై అభిప్రాయం చెప్పుమని శ్రీ సత్య అడుగుతుంది. కీర్తి గురించి అడగ్గా.. ఐ లైక్ హర్ యాటిట్యూడ్ అని చెబుతాడు. తర్వాత నేహా గురించి అడగ్గా.. షి ఈజ్ స్ట్రాంగ్ అంటాడు. దీంతో చూశావా.. కీర్తిని మాత్రం ఐ లైక్ అని చెప్పావు అని ఆడుకుంటారు. తర్వాత వాసంతి, నేహాని చూడమని రాజ్ కు చెప్పగా నార్మల్ గా చూస్తాడు.

కానీ కీర్తి భట్ ను చూడమని చెప్పగానే.. చూస్తూ కొద్దిగా బ్లష్ అవుతాడు కెప్టెన్ రాజ్. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వేస్తారు. చూశావా.. మిగతా వారిని నార్మల్ గా చూసిన నువ్.. కీర్తిని చూడగానే నవ్వుతున్నావ్ అంటూ ఏడిపిస్తారు. మరోవైపు రాజ్ నోటి నుంచి శ్రీ సత్య పేరు వచ్చినప్పుడు వారి దగ్గరకు వెంటనే వస్తాడు అర్జున్. ఇది గమనించిన నేహా అక్కడవారితో చెబుతూ నవ్వుతుంది. దీంతో కావాలానే శ్రీ సత్య.. రాజ్ నా గురించి ఏదో చెబుతాడట అందరూ వినండి అని అంటుంది. ఇలా కొంచెం గొడవలు, సరదాగా బాగానే సాగింది సెప్టెంబర్ 22న ప్రసారమైన 18వ రోజు 19వ ఎపిసోడ్.