Bigg Boss Elimination: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. బోల్డు బ్యూటీ సేఫ్.. ప్రమాదంలో టాప్ సెలెబ్రిటీ

అందమైన ఒక ఇంట్లో కొందరు సెలెబ్రిటీలు.. వంద రోజుల ప్రయాణం.. చిత్ర విచిత్రమైన టాస్కులు.. కెమెరాల మధ్యనే గొడవలు, కొట్లాటలు, రొమాన్స్, లవ్ ఇలా ఎన్నో ఎమోషన్స్.. మొత్తానికి గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టు.. అయితేనేం తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. మన దగ్గర వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది ఎంతో విజయవంతం అయింది. ఇక, ఈ మధ్యనే మొదలైన ఆరో సీజన్ ఆరంభం నుంచే ప్రేక్షకులకు మజాను పంచుతూ సాగుతోంది. ఇందులో మూడో వారం ఎవరు డేంజర్ జోన్‌లోకి వెళ్లారు అన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతుంలేంటో మీరే చూడండి మరి!

తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా సక్సెస్ అవుతుందనే చెప్పుకోవచ్చు. దీంతో నిర్వహకులు భారీ అంచనాలను ఏర్పరస్తూ ఆరో సీజన్‌ను ఇటీవలే మొదలు పెట్టారు. అందుకు అనుగుణంగానే ఇందులో కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, ఎందుకనో గతంలో మాదిరిగా ఈ సీజన్‌కు అంతగా రేటింగ్ రావడం లేదు. దీంతో ఆరంభంలోనే ఈ సీజన్‌కు షాక్ తగిలింది.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో మొదటి వారం మాత్రం ఎవరూ ఎలిమినేట్ కాలేదు.

బిగ్ బాస్ షోలో ప్రతి వారం ఎలిమినేషన్ ఉంటుంది. కానీ, అప్పుడప్పుడూ నిర్వహకులు ఎవరినీ పంపకుండా సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అదే సమయంలో ఒక్కో సందర్భంలో డబుల్ ఎలిమినేషన్ కూడా పెడుతుంటారు. ఈ రెండు పరిణామాలు ఈ సీజన్‌లో వరుసగా జరిగాయి. దీంతో మొదటి వారం అంతా సేఫ్ అవగా.. రెండో వారంలో షానీ, అభినయశ్రీలు బయటకు వెళ్లిపోయారు.

క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో మూడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్కు కూడా గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో ఏకంగా పది మంది ఎలిమినేషన్ ప్రమాదంలో పడిపోయారు. అందులో వాసంతి కృష్ణన్, ఇనాయా సుల్తానా, శ్రీహాన్ చోటూ, నేహా చౌదరి, ఆరోహి రావ్, చలాకీ చంటి, బాలాదిత్య, సింగర్ రేవంత్, గీతూ రాయల్, సుదీప పింకీలు ఉన్నారు.

బిగ్ బాస్ ఆరో సీజన్ మూడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్‌లో సింగర్ రేవంత్ కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో శ్రీహాన్ ఉన్నాడని తెలిసింది. మొత్తం పది మందిలో వీళ్లిద్దరికే దాదాపు నలభై శాతానికి పైగా ఓటింగ్ జరుగుతుందని టాక్.

అనసూయ అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా!

బిగ్ బాస్ ఆరో సీజన్ మూడో వారంలో జరుగుతోన్న ఓటింగ్‌లో రేవంత్, శ్రీహాన్ టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఈ సారి నామినేషన్స్‌లో మూడో స్థానంలో గీతూ రాయల్, నాలుగో స్థానంలో బాలాదిత్య, ఐదో స్థానంలో వాసంతి, ఆరో స్థానంలో చలాకీ చంటీలు ఉన్నారట.

ఆరో సీజన్ మూడో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఇనాయా సుల్తానా చివరి స్థానంలో ఉంది. కానీ, గురువారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఆమె ఏకంగా ఏడో స్థానానికి చేరుకుందని తెలిసింది. దీంతో ఆరోహీ ఎనిమిదో స్థానానికి, నేహా చౌదరి తొమ్మిదో స్థానానికి, సుదీప పదో స్థానానికి పడిపోయారు. వీళ్లలో చివరి ఇద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.