Bandh: రెచ్చిపోతున్న పీఎఫ్ఐ కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం, కేంద్రం, ఎన్ఐఏకి వ్యతిరేకంగా !

తిరువనంతపురం/కొచ్చి: ఎస్ డీపీఐ, పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా ( పీఎఫ్ఐ) కార్యాలయాల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు ఎస్ డీపీఐ, పీఎఫ్ఐ కార్యాలయాలు, ఆ సంస్థల నాయకుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన అనక మంది నాయకులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఎన్ఐఏ, ఈడీ అధికారుల దాడులను నిరసిస్తూ కేరళలో బంద్ నిర్వహించారు. కేరళలో పీఎఫ్ఐ నిర్వహించిన బంద్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కేరళ ఆర్ టీసీ బస్సులు, పలు ప్రైవేట్ వాహనాలు ద్వంసం కావడంతో పాటు అనేక మంది సామాన్య ప్రజలకు తీవ్రగాయాలైనాయి. కేరళలో పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు బలవంతంగా దుకాణాలు మూపించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.

Constable: అర్దరాత్రి ఫోన్ చేసి నువ్వు కత్తి, నాటుకోడి, నా కోరిక తీర్చు అని కవితలు చెప్పిన హెడ్ కానీస్టేబుల్ !Constable: అర్దరాత్రి ఫోన్ చేసి నువ్వు కత్తి, నాటుకోడి, నా కోరిక తీర్చు అని కవితలు చెప్పిన హెడ్ కానీస్టేబుల్ !

పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, కార్యకర్తలు ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని, యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపలు వచ్చాయి. ఇదే సందర్బంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హిందూ యువకులు హత్యకు గురైనారు. పీఎఫ్ఐ కార్యకపాలాపాలపై ఎన్ఐఏ అధికారులు కొంతకాలంగా నిఘా వేశారు.

ఎస్ డీపీఐ, పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా ( పీఎఫ్ఐ) కార్యాలయాల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు ఎస్ డీపీఐ, పీఎఫ్ఐ కార్యాలయాలు, ఆ సంస్థల నాయకుల నివాసాల్లో సోదాలు చేసిన ఎన్ ఐఏ అధికారులు వివిద పత్రాలు, డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో పీఎఫ్ఐ పార్టీకి చెందిన అనకమందిని ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ఐఏ, ఈడీ అధికారుల దాడులను నిరసిస్తూ కేరళలో శుక్రవారం బంద్ నిర్వహించారు. కేరళలో పీఎఫ్ఐ నిర్వహించిన బంద్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

కేరళని తిరువంతపురంలో కేరళ ఆర్ టీసీ బస్సులు, పలు ప్రైవేట్ వాహనాలు ద్వంసం కావడంతో పాటు అనేక మంది సామాన్య ప్రజలకు తీవ్రగాయాలైనాయి. ఆటో వెలుతున్న వ్యక్తితో పాటు 15 ఏళ్ల అమ్మాయి మీద పీఎఫ్ఐ కార్యకర్తలు దాడి చెయ్యడంతో వారికి తీవ్రగాయాలైనాయి. కేరళలో పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు బలవంతంగా దుకాణాలు మూపించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.

బెంగళూరు డీజేహళ్ళి గొడవల కేసులో పీఎఫ్ఐ కోప్పళ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఫయాజ్ అలియాస్ మోహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరులోని డీజేపీహళ్లిలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఆయన ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇదే కేసులో ఎన్ఐఏ దాడుల సమయంలో కోప్పళ పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరెస్టు కావడం చర్చకు దారితీసింది.