హోటల్లో సీక్రెట్ గా వేరే మహిళతో భర్త.. భద్రకాళిలా మారి షాకిచ్చిన భార్య; తగ్గేదేలే!!

భర్త మోసం చేస్తున్నాడని, భార్యలు ఇళ్లల్లో కూర్చుని ఏడ్చే రోజులు పోయాయి. వేరే మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని, తమకు అన్యాయం చేస్తున్న భర్తల పై భార్యలు తిరగబడుతున్న రోజులొచ్చాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మంథనిలో తాను ఉండగా భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడని తెలిసిన ఒక భార్య, భర్తను కరెంట్ పోల్ కట్టేసి, చెప్పుల దండ వేసి, చితకబాదింది. తనకు అన్యాయం ఎలా చేస్తావ్ అంటూ నిలదీసింది. ఇక తాజాగా మరో ఘటనలో తనను మోసం చేసి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య భద్రకాళి గా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే

ఆగ్రాలోని ఓ హోటల్‌లో ఓ భార్య తన భర్త మరో మహిళతో ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.ఓ గదిలో ప్రియురాలితో కలిసి రహస్యంగా భర్త చేస్తున్న బాగోతాన్ని బయట పెట్టింది. హోటల్ గదిలో వేరే మహిళతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య కోపం ఆపుకోలేక ఉతికి పారేసింది. చెప్పు తీసుకుని అటు భర్తను, భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళను తీవ్రంగా కొట్టింది. అంతేకాదు తనకు అన్యాయం చేస్తున్న భర్తను నోటికొచ్చినట్టు తిట్టిపోసింది. ప్రస్తుతంఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇక భార్య చేతిలో చావు దెబ్బలు తింటున్న భర్త చేతులు జోడించి భార్యకు క్షమాపణలు చెప్పారు. నన్ను క్షమించు ముందు ముందు ఇలాంటి తప్పులు చెయ్యను అంటూ భార్యను భర్త ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ భర్తపై దాడి ఆపని భార్య, అప్పటికే తాను భర్త ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చానని, అయినా మళ్ళీ భర్త పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ అలాగే ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగింది.

తన సోదరుడితో కలిసి హోటల్ కి వెళ్లిన మహిళ భర్త చేసిన పనికి భద్రకాళిగా మారి చావ చితగ్గొట్టింది. తమకు 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, 16 ఏళ్ల కుమార్తె మరియు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నారని పేర్కొన్న మహిళ,తమ కుమార్తె తన తండ్రిని, తండ్రి అని పిలవడానికి కూడా నిరాకరిస్తుంది అని పేర్కొంది. అంతగా అతని ప్రవర్తన ఉందని అసహనం వ్యక్తం చేసింది. తల్లీ , సోదరుడితో కలిసి హోటల్ కు వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దాడి చేసిన ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భార్యలను మోసం చేస్తే భర్తలకు ఈ మాత్రం శాస్తి జరగాల్సిందేనని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు మగాళ్ళు తగ్గడం లేదని… ఆడవాళ్ళు అసలే తగ్గటం లేదంటూ ఈ వీడియో పై సెటైర్లు వేస్తున్నారు.