షారుక్, విజయ్‌తో ఫోటో.. బర్త్ డే రోజున ఇంతకంటే ఏం కావాలి.. అట్లీ ఎమోషనల్

తమిళ దర్శకుడు అట్లీ వరుస విజయాలు, క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొన్నారు. బలమైన కథలు, విభిన్నమైన కథనం, విలక్షణమైన పాత్రలతో తన సినిమాలను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నారు. ఇలాంటి సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ తన జన్మదినాన్ని సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకొన్నారు. అయితే పలువురు సినీ ప్రముఖులు అట్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తన పుట్టిన రోజును పురస్కరించుకొని విజయ్, షారుక్ ఖాన్‌తో దిగిన ఫోటోను షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అట్లీకి షారుక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైనర్‌మెంట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. మీ స్టోరీలు పవర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్స్‌గా సినిమాగ్రాఫ్‌ను పెంచుతున్నాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీకి హ్యాపీ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేసింది.

తన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ మై ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తమ సమయాన్ని తీసుకొని విషెస్ తెలిపారు. నా విషెస్ తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని అట్లీ ట్వీట్ చేశారు.

What more can I ask on my bday , the best bday ever wit my pillars. My dear @iamsrk sir & ennoda annae ennoda thalapathy @actorvijay ❤️❤️❤️ pic.twitter.com/sUdmMrk0hw

ఇక నా పుట్టిన రోజున ఇంతకంటే ఏమి అడగాలి. నాకు మూలస్తంభాలుగా నిలిచిన ఇద్దరు స్టార్స్‌తో నా జీవితంలో ఎన్నడూ లేని విధంగా బర్త్ డే జరుపుకొన్నాను. షారుక్ ఖాన్, దళపతి విజయ్‌కు థ్యాంక్స్ అని అట్లీ ట్వీట్ చేశారు.