వారఫలితాలు తేదీ 23 సెప్టెంబర్ శుక్రవారం నుండి 29 గురువారం 2022 వరకు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు, జైశ్రీమన్నారాయణ.

ఈ వారం పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినీయవు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విందువినోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్రలాభాలు. విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం రుణ ఒత్తిడులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయ త్నాలు సాగిస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. సాంకేతికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వార్తలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. విద్యార్థులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. ఆలయాలు సందర్శిస్తారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విశేష యోగదాయకం. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో మానసిక ఆందోళన. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ఆర్థిక, వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి. కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.