రాహుల్ యాత్ర ఎఫెక్ట్ -మసీదులో ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్-ముస్లింలకు చేరువయ్యే ప్లాన్ ?

ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ తాజాగా ఢిల్లీ మసీదుకు వెళ్లి ముస్లిం మత పెద్దలతో జరిపిన సమావేశం కలకలం రేపుతోంది. ఆరెస్సెస్ పై జనంలో ఉన్న మతపరమైన భావనను తొలగించేందుకు గతంలోనూ పలు ప్రయత్నాలు చేసిన భగవత్.. ఇప్పుడు తాజాగా ముస్లింలను చేరువయ్యేందుకే ఇలా చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం నేతలను కలుస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా ఢిల్లీలోని మసీదును సందర్శించి అక్కడన్న మతపెద్దలతో సమావేశమయ్యారు. మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు ఉమర్ అహ్మద్ ఇలియాసిని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఒక మసీదులో ప్రభుత్వ, రాజకీయ కార్యాలయాలకు చాలా దూరంలో కలిశారు.గంటకు పైగా సాగిన ఈ రహస్య భేటీలో ఏం చర్చించారన్నది బయటికి రాలేదు. అయితే దీనిపై స్పందించిన ముస్లిం పెద్దలు మాత్రం… ఇది దేశానికి చాలా మంచి సందేశాన్ని పంపుతుందన్నారు. తాము ఒక కుటుంబంలా చర్చించామని వారు తమ ఆహ్వానంపై రావడం అద్భుతంగా ఉందన్నారు.

Delhi | RSS chief Mohan Bhagwat held a meeting with Dr Imam Umer Ahmed Ilyasi, Chief Imam of All India Imam Organization, at Kasturba Gandhi Marg mosque today pic.twitter.com/vxfo0IPsMa

అటు ఆర్‌ఎస్‌ఎస్ కూడా తమ చీఫ్ ఇటీవల ముస్లిం మేధావులతో సమావేశమై మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించారని తెలిపింది. కర్నాటకలో హిజాబ్ ఘటనల తర్వాత ఈ పరిణామం చాలా కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటికే మహమ్మద్ ప్రవక్తపై హింస, నిరసనలను ప్రేరేపించిన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ ను బీజేపీ సస్పెండ్ చేసింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని ఒక మందిరంలో హిందూ ప్రార్థనలను అభ్యర్ధించిన పిటిషన్ నేపథ్యంలో.. ప్రతి మసీదు కింద ఒక శివలింగాన్ని వెతకాలి అని భగవత్ చేసిన ప్రకటన ఆవశ్యకతను ప్రశ్నిస్తూ ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఆగస్టు 22న భగవత్ ఐదుగురు ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత సామరస్య వాతావరణం గురించి తన ఆందోళనలను పంచుకున్నారు. ఈ సమావేశంలో దేశంలో విద్వేష వాతావరణాన్ని తగ్గించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇందులో ఉమ్మడి అభ్యంతరాలపైనా చర్చించారు. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో దేశాన్ని మతపరంగా విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న చర్చ పెరుగుతోంది. దీంతో ఆరెస్సెస్ అప్రమత్తమైందన్న ప్రచారం కూడా జరుగుతోంది.