బెల్లంకొండ 'ఛత్రపతి' రీమేక్ చూడగానే.. మరో 500 కోట్లతో సినిమా ఆఫర్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకునేందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన శ్రీనివాస్ తన కెరీర్ మొత్తంలో ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలోనే నటించాడు. ఇక ఇప్పుడు అతను హిందీలో చత్రపతి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా చూడగానే ప్రముఖ బడా సంస్థ దర్శకుడికి 500 కోట్లతో సినిమా చేయమని ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా నిర్మాత తెలియజేయడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

ఆది, చెన్నకేశవరెడ్డి అలాగే మరికొన్ని బాక్సాఫీస్ సినిమాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ తన కుమారులు ఇద్దరినీ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా పెద్ద కుమారుడు అల్లుడు శ్రీను అనే సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఆ సినిమాను డైరెక్టర్ చేశాడు. అప్పట్లోనే ఆ సినిమాను హై బడ్జెట్ లో నిర్మించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ సినిమాలు ఎన్ని చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ శాతం సక్సెస్ అయితే దక్కింది లేదు. ఇక చివరిగా రాక్షసుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టబడిన వెనక్కి తీసుకువచ్చింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలకు మాత్రం మంచి క్రేజ్ ఉంది. చాలా వరకు యూట్యూబ్లో అతని సినిమాలు మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి.

అయితే ఇప్పుడు హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద డైరెక్ట్ గా సక్సెస్ కొట్టాలి అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చత్రపతి రీమేక్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఆ సినిమాను మాస్ డైరెక్టర్ వివి.వినాయక్ డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నట్లుగా చిత్ర నిర్మాత సురేష్ ఇటీవల తెలియజేశారు.

చత్రపతి రీమేక్ సినిమా చాలా బాగా వచ్చింది అంటూ ఈ సినిమాను నిర్మిస్తుంది పెన్ స్టూడియోస్ అని ఇప్పటికే ఆ సంస్థలో RRR సినిమా హిందీలో విడుదల అయింది అని అలాగే గంగుబాయి ఖతీయవాడి సినిమా కూడా భారీ స్థాయిలో నిర్మించారని ఇక ఇప్పుడు చత్రపతి రీమేక్ సినిమాను కూడా హిందీలో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లుగా సురేష్ తెలియజేశారు.

అయితే వివి వినాయక్ ఆ సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేసినట్లుగా చెబుతూ పెన్ స్టూడియోస్ లోనే ఆయన మరో సినిమాను చేసే ఆఫర్ కూడా అందుకోబోతున్నట్లుగా తెలియజేశారు. చత్రపతి రీమేక్ సినిమాను చూడగానే పెన్ స్టూడియోస్ వారు వినాయక్ ను ప్రత్యేకంగా ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయమని సాధారణంగా ఏదో చిన్న సినిమా కాకుండా దాదాపు 500 కోట్లు బడ్జెట్లో అయినా నిర్మించాలి అని వాళ్ళు వినాయక్ ను అడిగినట్లుగా సురేష్ బాబు తెలియజేశారు.