పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు

పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450):

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న బైక్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువమంది బైక్ ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది. అయితే ఈ కంపెనీ త్వరలోనే కొత్త హిమాలయన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

  పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రానున్న కొత్త హిమాలయన్ 450 బైక్ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీనికి సంబందించిన కొన్ని చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే రానున్న కొత్త హిమాలయన్ 450 దాని మునపటి మోడల్ కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైకు యొక్క ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్ కనిపిస్తుంది. అదే సమయంలో దాని డిజైన్ కూడా కొంత అప్డేట్ చేయబడి ఉంటుంది. కావున ఎగ్జాస్ట్‌ కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. అయితే కొన్ని భాగాలు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఈ బైక్ త్వరలోనే దేశీయ మార్కెట్లో విడుదల కానుంది.

పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు హీరో ఎక్స్‌పల్స్ 400 & ఎక్స్‌ట్రీమ్ 400ఎస్ (Hero Xplus 400, Xtreme 400S):

పండుగ సీజన్ లో విడుదలకావడానికి హీరో మోటోకార్ప్ యొక్క ‘ఎక్స్‌పల్స్ 400 మరియు ఎక్స్‌ట్రీమ్ 400ఎస్’ కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ బైకులను టెస్ట్ చేస్తూనే ఉంది. కొంతకాలం కిందట ఎక్స్‌పల్స్ 400 మరియు ఎక్స్‌ట్రీమ్ 400ఎస్ రెండూ కూడా టెస్టింగ్ సమయంలో కనిపించాయి. కావున ఈ బైకులు మార్కెట్లో విడుదల కావడానికి ఇంక ఎన్నో రోజులు ఉండే అవకాశం ఉండదు, అని తెలుస్తోంది.

పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు మార్కెట్లో విడుదల కానున్న హీరో ఎక్స్‌పల్స్ 400 & ఎక్స్‌ట్రీమ్ 400ఎస్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అయితే వీటికి సంబందించిన సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది. అయితే ఇవి 400 సిసి మోడల్స్ గా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇవి కంపెనీకి రానున్న రోజుల్లో అత్యంత ముఖ్యమైన మోడల్స్ కానున్నాయి.

పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు 2022 బజాజ్ ఎన్150 (2022 Bajaj N150):

ఇప్పటికే ఏసియా మార్కెట్లో మంచి అమ్మకాలతో అత్యంత ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతున్న బజాజ్ పల్సర్ ఇప్పుడు మరో కొత్త మోడల్ లో దర్సనమివ్వబోతోంది. ఈ కొత్త మోడల్ 2022 బజాజ్ ఎన్ 150 పేరుతో ముందుకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ బైక్ టెస్టింగ్ దశలో ఉంది, కావున ఇది దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కొత్త బైక్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, కానీ ఇది 150 సిసి ఇంజిన్ తో విడుదల కానుంది.

పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు హీరో ఎక్స్‌పల్స్ 200టీ (Hero XPulse 200T):

హీరో మోటోకార్ప్ యొక్క ‘ఎక్స్‌పల్స్ 200టీ’ కూడా పండుగ సీజన్ లో విడుదల కావడానికి సిఏమవుతోంది. ఇది దాదాపు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మంచి లుక్ మరియు లేటెస్ట్ గ్రాఫిక్ డిజైన్ పొందుతుంది. ఇది కూడా ఇప్పటికే టెస్టింగ్ సమయంలో కనిపించింది, కావున త్వరలోనే విడుదల కానుంది.

పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ (Hero Vida Electric Scooter):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘హీరో మోటోకార్ప్’ త్వరలోనే దేశీయ విఫణిలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ వివలా చేయనుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వచ్చే నెల 07 న (అక్టోబర్ 07) విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. హీరో మోటోకార్ప్ నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ‘విడా’.

పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇది రూ. 1 లక్ష ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. లాంచ్ ఈవెంట్ కూడా అక్టోబర్ 07 న జైపూర్‌లో జరగనున్నట్లు సమాచారం.

పండుగ సీజన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కొత్త టూవీలర్స్.. ఇవే: వివరాలు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో కొత్త బైకులు కొనాలని ఎదురు చూస్తున్నవారికి నిజంగానే మంచి తరుణం అనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్లో కొత్త బైకులు విడుదల కావటానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్త బైకుల యొక్క ధరలు మరియు ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. అప్పటివరకు ఈ కొత్త బైక్స్ గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.