దాని కోసం తొడలు కొట్టండి.. ముందు మీ తాత పార్టీని లాక్కొండి.. jr ఎన్టీఆర్ పై మాజీ మంత్రి కామెంట్స్!

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కాలంలో మళ్ళీ రాజకీయా అంశాలకు కాస్త దగ్గరవుతుండడం చర్చనీయాంశంగా మారుతొంది. రీసెంట్ గా బిజెపి నేత అమిత్ షాను కలిసిన తర్వాత మళ్ళీ ఆయన తన తాత గారికి సంబంధించిన మరొక విషయం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతూ ఉండడంతో వెంటనే రియాక్ట్ అయ్యాడు. అయితే ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రముఖ మాజీ మంత్రి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇతర నందమూరి హీరోలకు కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై తీవ్ర స్థాయిలో భిన్నభిప్రాయాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఆ యూనివర్సిటీకి ముందుగా ఎన్టీఆర్ పేరు ఉండగా ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్సార్ పేరును మారుస్తూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో కాంట్రవర్సీ గా మారింది. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అలాగే నందమూరి అభిమానుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇక ఈ విషయంపై నందమూరి హీరోలు ఏ విధంగా స్పందిస్తారు అని అనుకుంటున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన విధానం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను పెద్దగా వివాదాలకు తావివ్వకుండా చాలా సెన్సిటివ్ గా ఈ విషయంపై స్పందించినట్లుగా అర్థమయింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఒక వివరణ అయితే ఇచ్చాడు.

కళ్యాణ్ రామ్ అయితే కాస్త ప్రస్తుత ప్రభుత్వం పై డైరెక్ట్ గా కామెంట్ చేశాడు కానీ ఎన్టీఆర్ మాత్రం ఒకవైపు వైఎస్ఆర్ ని పొగుడుతూనే మరొకవైపు ఎన్టీఆర్ ప్రతిష్ట కూడా తగ్గదు అనే విధంగా స్పందించాడు. ముందుగా కళ్యాణ్ రామ్ ఈ విశ్వవిద్యాలయం పేరు మార్చడం బాధ కలిగించింది అంటూ ఒక రాజకీయ లాభం కోసం చాలామంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం చాలా తప్పు అని కూడా ఖండించాడు.

ఇంకా ఎన్టీఆర్ స్పందిస్తూ వైయస్సార్ తో పాటు ఎన్టీఆర్ కూడా ప్రజాదారణ పొందిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరు పేరు పెట్టడం ద్వారా వైఎస్ఆర్ స్థాయిని పెంచదు. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. ఇక విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా.. ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేదు.. అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ స్పందించిన విధానంపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చారు.. నందమూరి ఎన్టీఆర్ మనవళ్లుగా ఈ రకంగా ట్వీట్స్ వేయడం కాదు అంటూ ముందుగా మీ టిడిపి పార్టీని లాక్కోండి అని.. ఆ పార్టీ మీది అంటూ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఫస్ట్ పార్టీ కోసం తొడలు కొట్టండి.. ఊరికే సౌండ్ ఎందుకు. మీ తాత పార్టీని లాక్కోండి. నందమూరి వంశాన్ని చంపేశారు.. ఇప్పుడు అంతా నారానే ఉంది.. అనిల్ కుమార్ యాదవ్ వివరణ ఇచ్చాడు.