దళితులపై కేసీఆర్ ది దొంగప్రేమ, వికారాబాద్ ఎమ్మెల్యే చేస్తున్నదేంటి? టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వికారాబాద్ లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించిన వైఎస్ షర్మిల, తెలంగాణా ప్రభుత్వ తీరుపై, సీఎం కేసీఆర్ పై అలాగే స్థానిక ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులంటే కేసీఆర్ కు దొంగ ప్రేమని, దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి, మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆదివాసీలను మోసం చేయడానికి ఆదివాసి బంధు అంటూ కొత్త రాగం అందుకున్నాడు అంటూ వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు.

వికారాబాద్ MLA ఒక డాక్టర్ గా ప్రజలకు మేలు చేయాల్సింది పోయి కీడు చేస్తున్నాడు.అడిగేవాళ్లే లేరని భూకబ్జాలు,అక్రమ నిర్మాణాల్లో ఆరితేరారు.ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారు.దళిత MLA అయ్యుండి నేరేళ్ల, మరియమ్మ ఘటనలపై స్పందించకపోవడం సిగ్గుచేటు.#PrajaPrasthanam #Vikarabad pic.twitter.com/OiD15XDFnN

వికారాబాద్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల వికారాబాద్ ఎమ్మెల్యే ఒక డాక్టర్ గా ప్రజలకు మేలు చేయాల్సింది పోయి కీడు చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అడిగేవాళ్లే లేరని భూకబ్జాలు,అక్రమ నిర్మాణాల్లో ఆరితేరారని విమర్శలు గుప్పించారు. ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారు వైయస్ షర్మిల.దళిత ఎమ్మెల్యే అయ్యుండి నేరేళ్ల, మరియమ్మ ఘటనలపై స్పందించకపోవడం సిగ్గుచేటు అంటూ వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు .

దళితులంటే కేసీఆర్ కు దొంగ ప్రేమ.దళిత ముఖ్యమంత్రి,మూడెకరాల భూమి, దళిత బంధు అంటూ మోసం చేశాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తెలంగాణ ఏర్పడితే ఆ రాజ్యాంగాన్నే మార్చాలన్న నియంత ఈ దొర.ఆదివాసీలను కూడా మోసం చేయడానికి ఆదివాసీ బంధు అంటూ కొత్తరాగం ఎత్తుకున్నాడు.#PrajaPrasthanam #Vikarabad pic.twitter.com/6pGHwTIOkr

అంతేకాదు దళితులంటే కేసీఆర్ కు దొంగ ప్రేమ ఉందని, దళిత ముఖ్యమంత్రి అని, మూడెకరాల భూమి అని, దళిత బంధు అని దళితులను మోసం చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాజ్యాంగాన్ని మార్చాలన్న నియంత ఈ దొరా అంటూ కెసిఆర్ ను టార్గెట్ చేశారు. ఇక ఇప్పుడు గిరిజనులను మోసం చేయడానికి గిరిజన బంధు అంటూ కొత్త పాట పాడుతున్నారని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో ఏ హాస్టల్ ను చూసినా పురుగుల అన్నం.. బొద్దింకల భోజనమే. నా మనవడు తినే తిండే తెలంగాణ బిడ్డలు తినాలని గప్పాలు కొట్టిన కేసీఆర్.. పిల్లలకు కలుషిత ఆహారం పెడుతున్నాడు. పిల్లలు ప్రశ్నించలేరు.. పిల్లలకు ఓట్లు లేవనేనా? మీ వేషాలు?#PrajaPrasthanam #Vikarabad pic.twitter.com/UN0ApizB7H

ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైయస్ షర్మిల రాష్ట్రంలో ఏ హాస్టల్ ను చూసినా పురుగుల అన్నం.. బొద్దింకల భోజనమే ఉందని అసహనం వ్యక్తం చేశారు. నా మనవడు తినే తిండే తెలంగాణ బిడ్డలు తినాలని గప్పాలు కొట్టిన కేసీఆర్.. పిల్లలకు కలుషిత ఆహారం పెడుతున్నాడు అంటూ మండిపడ్డారు. పిల్లలు ప్రశ్నించలేరు.. పిల్లలకు ఓట్లు లేవనేనా? మీ వేషాలు? అని వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రకు తరలివచ్చి, ఘన స్వాగతం పలికిన వికారాబాద్ జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. పాదయాత్రలో నాతో పాటు అడుగులు వేసి, మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా. త్వరలోనే వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తా.#PrajaPrasthanam #Vikarabad pic.twitter.com/fePvPfD9hs

మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే వికారాబాద్ జిల్లా అభివృద్ధి చెందేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు. టూరిజం హబ్ గా, శాటిలైట్ టౌన్ గా మారేదని షర్మిల వ్యాఖ్యానించారు. కెసిఆర్ అనంతగిరిని తెలంగాణ ఊటీగా,ఔషధ నగరిగా మారుస్తానన్నాడు.టీబీ హాస్పిటల్ కడతానన్నాడు. రింగ్ రోడ్డు వేస్తానన్నాడు.టెక్స్ టైల్ పార్క్ నిర్మిస్తానన్నాడు.చివరికి హామీలన్నీ అటకెక్కించాడు అంటూ వైయస్ షర్మిల కెసిఆర్ చెప్పిన ఏ పనిని చేయడం తనదైన శైలిలో టార్గెట్ చేశారు. వైయస్సార్ సంక్షేమ పాలన కోసం వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి అవకాశం ఇవ్వాలని, అప్పుడు వికారాబాద్ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు వైయస్ షర్మిల.