చిన్నప్పుడు పెళ్లికి వెళ్లిన హీరోయిన్ తోనే హీరో డేటింగ్.. ఫొటో వైరల్

ఒక మనిషి జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సంఘటనలు, పరిణామాలు చోటుచేసుకుంటాయే చెప్పడం కష్టం. ముఖ్యంగా కొన్నిసార్లు సినీ సెలబ్రిటీల విషయాలు విచిత్రంగా ఉంటాయి. ప్రొఫెషనల్ లైఫ్ నుంచి వ్యక్తిగత జీవితం వరకు ఊహించని పరిణామాలు జరుగుతాయి. సినిమాలో స్క్రిప్ట్ రాసుకున్నట్లుగా సాగదు రియల్ లైఫ్ స్టోరీస్. ఇక వీరి విషయాలు అంటే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తికర విషయమే ఇది. ఓ హీరోయిన్ పెళ్లికి చిన్నప్పుడు వెళ్లిన కుర్రాడు పెరిగి పెద్దయి పాపులర్ హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఎవరి పెళ్లికి అయితే చిన్నప్పుడు వెళ్లాడో ఆ హీరోయిన్ తోనే ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడు.

బాలీవుడ్ సీనియర్ అండ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో చయ్యా చయ్యా అంటూ ఓ రేంజ్ లో పాపులర్ కాగా మున్నీ బదనామ్ హుయి అంటూ మరోసారి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే మలైకా అరోరా ఇంతకుముందు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం అయి విడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్ చేస్తూ అనేక ప్రాంతాలకు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.

అయితే 1998లో అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి జరిగే సమయానికి అర్జున్ కపూర్ వయసు 13 ఏళ్లు. ఈ పెళ్లికి హాజరైన అర్జున్ కపూర్ చక్కగా కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పిల్లాడిగా ఉన్నప్పుడు మలైకా పెళ్లికి వెళ్లిన అర్జున్ కపూర్.. పెద్దయ్యాక ఆమెతోనే డేటింగ్ చేస్తాడని ఎవరి ఊహించరు ఉండరు. వీరిద్దరి మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉండగా, ప్రేమకు వయసు అడ్డం కాదు అని నెటిజన్ల అంటున్నారు. ఇదిలా ఉంటే అచ్చం వీరిలాగే మరో జంటకు కూడా జరిగింది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ 1991లో అమత సింగ్ ను వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆ పెళ్లికి అక్క కరిష్మా కపూర్ తో సహా కలిసి హాజరైంది బాలీవుడు బెబో కరీనా కపూర్. సైఫ్ అలీ ఖాన్ పెళ్లి సమయానికి కరీనా కపూర్ కు 11 ఏళ్లు. కట్ చేస్తే దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2012లో సైఫ్ ను పెళ్లాడింది కరీనా కపూర్. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.