ఇరాన్ హిజాబ్ రచ్చ- ట్విట్టర్ లో మహిళల వీడియోల వైరల్-ఇంటర్నెట్ కట్

ఇరాన్ లో హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో ఓ మహిళను నిర్బంధించడం, ఆ తర్వాత ఆమె చనిపోవడంతో మొదలైన ఉద్రిక్తతలు పతాకస్ధాయికి చేరుకుంటున్నాయి. హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటిలో హిజాబ్ ధరించిన మహిళల్ని సైతం కొడుతున్న వీడియోలు వైరల్ అవుతుండటంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ ను తాత్కాలికంగా నిలిపేసింది.

ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు ప్రారంభమైన తర్వాత అక్కడ హిజాబ్ ధరించిన మహిళలపై సైతం దాడులు పెరుగుతున్నాయి. నిరసనకారులు హిజాబ్ ను బహిష్కరించాలనే పిలుపు ఇస్తున్నా ఇంకా మహిళలు హిజాబ్ ధరిస్తూనే ఉండటంతో వారిపై దాడులకు దిగుతున్నారు. దీంతో ఈ దాడుల వీడియోల్ని స్ధానికులు ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలను చూసిన ఇతర దేశాల ప్రజలు ఇరాన్ లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇరాన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో తాత్కాలికంగా ఇంటర్నెట్ నిలిపేసింది.

ట్విట్టర్ లో ఇలా షేర్ అయిన ఓ వీడియోల ఇరాన్‌లో తాజా పరిస్ధితుల్ని ప్రజలు పంచుకున్నారు. ఇరాన్ లో ఇప్పుడు ఇంటర్నెట్ కట్ చేస్తున్నారని, ఎందుకంటే ప్రజలు ఇలాంటి వాటిని చూడకూడదనుకుంటున్నారంటూ ఓ వీడియోను పెట్టారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టి ఏమీ తెలియనట్లుగా వెళ్ళిపోతున్నాడు. కానీ అలా వెళ్తున్న సదరు వ్యక్తిని ఇతరులు అడ్డుకుని వెంటాడి కొడుతున్నారు. ఇలాంటి ఘటనల వీడియోలు ట్విట్టర్ లోకి వెళితే ఇతర దేశాల ముందు పరువుపోతుందనేది ఇరాన్ ప్రభుత్వ భయంగా కనిపిస్తోంది.

The internet is now being cut in Iran because they don’t want people to see things like this: a man slaps a woman and thinks he can calmly walk away. Where such actions were commonplace before, there are now dire consequences – significantly handed out by other men. pic.twitter.com/iQ2llURxLS