Viral video:మంచు దుప్పటిలో హరివిల్లు, ఓనమ్ స్పెషల్, కేరళ యువకులు

ఓనమ్.. హిందువుల పండగ, ముఖ్యంగా కేరళీయులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు విదేశాల్లో కూడాఫెస్టివల్ జరుపుకుంటున్నారు. అయితే అంటార్కిటికాలో కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ చలి మాములుగా ఉండదు. ఆ ఫెస్ట్‌ను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఓనమ్ పండగ జరుపుకోవడంలో భారతీయులను ఆపలేరు.. చివరికీ అంటార్కిటికాలో కూడా జరుపుకున్నారని అని రాశారు. దానికి వీడియో కూడా జోడించారు. చలిలో కూడా యువత అక్కడ కనిపించారు. ఐస్ మీద ముగ్గులు వేస్తూ..పోటీ పడ్డారు. పుకాలమ్‌లో వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వీడియోలో ఐదుగురు యువకులు కనిపించారు.

మంచుగడ్డపై ఐదుగురు యువకులు పోటీ పడి మరీ హరివిల్లు వేశారు. వారు ముగ్గు వేసే సమయంలో భారతీయ క్లాసికల్ మ్యూజిక్ వినిపించింది. ఇక్కడ పూలు అందుబాటులో ఉండవు. అందుకే ఐస్ మీద.. కత్తి, సుత్తి, స్కూ డైవర్ పట్టుకొని ముగ్గు మాదిరిగా వేశారు. కానీ చాలా చక్కగా వారు హరివిల్లును తీర్చిదిద్దారు. మైనస్ 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో.. ఎముకలు కొరికే చలిలో వారు హరివిల్లు వేసి.. ఓనమ్‌కు ఉన్న విశిష్టతను చాటారు.

ఆ వీడియో వైరల్ అవుతుంది. చాలా మంది షేర్ చేస్తున్నారు. కామెంట్లతో ఇన్ బాక్స్ నిండుతుంది. వావ్ అంటూ పొగుడుతున్నారు. చలిలో కూడా హరివిల్లును తీర్చిదిద్ది.. పండగ ప్రత్యేకతను చాటారని పేర్కొన్నారు.