Richa Gangopadhyay: స్టార్ హీరోను చెప్పుతో కొడతానన్న ప్రభాస్ హీరోయిన్.. అందుకే ఆఫర్స్ రాలేదా?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, అసభ్యకర ప్రవర్తనలు సర్వ సాధారణం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో ఇలాంటి విషయాలు చాలా తర్వగా తెలుస్తున్నాయి. కానీ అప్పట్లో హీరోయిన్లకు ఈ క్యాస్టింగ్ కౌచ్ బెడద ఎక్కువగానే ఉండేది. అప్పుడు ఆ డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ ల పొజిషన్ చూసి, మాట్లాడితే అవకాశాలు రాకుండా చేస్తారేమో వంటి తదితర కారణాలతో బయటకు చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడు అలా లేదు. తమకు ఎలాంటి నష్టం జరిగిన ఓపెన్ గా బయటపెట్టేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో రిచా గంగోపాధ్యాయ్ ను వేధించాడట.

సినీ ఇండస్ట్రీలో చేసింది కొన్ని సినిమాలే అయిన తనకంటూ ఓ గుర్తింపు పొందింది రిచా గంగోపాధ్యాయ్. దగ్గుబాటి రాణా నటించిన లీడర్ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన మిరపకాయ్ చిత్రంలో నటించి పాపులర్ అయింది.

హరిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రిచా గంగోపాధ్యాయ్ సాంప్రాదాయబద్ధమైన బ్రహ్మాణ యువతిగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన మిర్చీ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నాగవల్లి, సారోచ్చారు, భాయ్ తదితర చిత్రాల్లో నటించింది రిచా ఈ ఢిల్లీ భామ. ఇక ఆ తర్వాత తెలుగు వెండితెరపై కనుమరుగై పోయింది. అందుకు కారణం ఓ స్టార్ హీరో అని తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో కార్ వ్యాన్ లో ఆ స్టార్ హీరో రిచాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడట. చాలా చెత్తగా బిహేవ్ చేసిన ఆ హీరోను చెప్పుతో కొడతానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిందట రిచా.

దీంతో రిచా పాత ప్రైవేట్ వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేసి మరి ఆమెను టార్చర్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బాధలన్ని భరించలేకే, అవకాశాలు రాకే సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైనట్లు పలు మీడియాల్లో వార్తలు వైరల్ అయినట్లు సమాచారం. కాగా న్యూ ఢిల్లీకి చెందిన రిచా గంగోపాధ్యాయ్ చదువుల కోసం అమెరికా వెళ్లినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అక్కడ మిస్ ఇండియాకి కూడా పోటీ చేసిందట.

2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం కూడా సాధించింది రిచా గంగోపాధ్యాయ్. ఇక రిచా గంగోపాధ్యాయ్ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించింది. శింబు, ధనుష్ వంటి స్టార్ హీరోలకు సరసన హీరోయిన్ గా మెరిసింది.

తన ఎంబీఏ ఫ్రెండ్ చోయీ లంగెళ్లను వివాహం చేసుకున్న రిచా గంగోపాధ్యాయ్ 2021లో మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సినిమాలకు దూరమైన కూడా సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది రిచా. తన ఫ్యామిలీకి సంబంధించిన పోస్ట్ లు పెడుతూ అభిమానులకు చేరువ అవుతోంది.