Job Insecurity & Moonlighting: ఉద్యోగుల్లో అభద్రత ఒత్తిడి.. ఎలా ఎదుర్కోవాలంటే?

Job Insecurity & Moonlighting: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో 300 మంది ఉద్యోగులను ఉన్నపళంగా పీకేసింది. మూన్ లైటింగ్ విధానంలో విప్రోకు చెందిన 300 మంది ఉద్యోగులు.. తమ పోటీ సంస్థ కోసం కూడా పని చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో ఆ 300 మందిని ఉద్యోగాల్లో నుండి పీకేసి ఇంటికి పంపించింది. మూన్ లైటింగ్ విధానంలో పని చేయడం తమ సంస్థకు నమ్మక ద్రోహం కలిగించడమేనని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తెలిపారు.

మూన్‌లైటింగ్ అనేది సాధారణంగా రాత్రి లేదా వారాంతాల్లో చేసే ఒక రకమైన సైడ్ ఎంప్లాయిమెంట్. అమెరికన్లు తమ ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఉద్యోగం చేసుకుని ఆ తర్వాత అదనపు ఆదాయం కోసం వేరే ఉద్యోగం చేసే వాళ్లు. కొందరు వీకెండ్స్ లో మరో ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదించే వారు. అలా ఈ విధానానికి మూన్ లైటింగ్ అనే పదం వచ్చింది.

ఉద్యోగంలో చేరే సమయంలోనే ఈ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం తప్పు అని కాంట్రాక్ట్ లో రాసి ఉంటి.. మూన్ లైటింగ్ మోసంగా పరిగణించబడుతుంది. కొంత కాలం క్రితం మూన్ లైటింగ్ తక్కువగా ఉన్నప్పటికీ కొవిడ్-19 తర్వాత అదనపు ఆదాయం కోసం మరో ఉద్యోగం చేయడం అనేది పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు.

ఉద్యోగ అభద్రత, చాలీచాలని జీతం వల్లే ఉద్యోగులు మూన్ లైటింగ్ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఆదాయం సరిపోకపోతే మరో ఉద్యోగం చేయాల్సిందేనని అంటున్నారు.

నేడు ఏ రంగంలోనూ ఉద్యోగానికి భద్రత లేదు. చాలా కంపెనీలు కాస్ట్ కటింగ్ లో భాగంగా తమ ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. సాలరీ హైక్ లు ఆశించిన మేర ఉండటం లేదు. ప్రయోజనాల ప్యాకేజీలు తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఉద్యోగులు అభద్రతకు గురి అవుతున్నారని అంటున్నారు. కొవిడ్-19 కాలంలో వేలాది మంది ఉద్యోగం పోయి రోడ్డున పడ్డారు. ఉన్నపళంగా ఆదాయం ఆగిపోవడంతో జీవితం మొత్తం తలకిందులు అయింది. ఉద్యోగం కోల్పోని వారు కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. వారి ఉద్యోగం కూడా ఊడుతుందన్న భయం వారిని కుదురుగా ఉండనివ్వలేదు.

ఉద్యోగ అభద్రత ఒత్తిడి వల్ల మానసికంగా తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఆరోగ్య నిపుణులు పని-సంబంధిత ఒత్తిడి యొక్క లక్షణాలు శారీరక, మానసిక మరియు ప్రవర్తనాపరమైనవిగా ఉంటాయని భావిస్తున్నారు:

 • అలసట

 • కండరాల ఒత్తిడి

 • తలనొప్పులు

 • నిద్రలేమి

 • అతిసారం లేదా మలబద్ధకం

 • డిప్రెషన్

 • చిరాకు

 • తట్టుకోలేకపోతున్నామనే భావన

 • ఏకాగ్రత లేదా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడం వంటి ఇబ్బందులు

 • అగ్రెషన్

 • పనితీరులో తగ్గుదల

  సాధారణంగా పని-సంబంధిత ఒత్తిడిని కలిగించే కొన్ని ముఖ్యమైన కారణాలు సుదీర్ఘ పని గంటలు, అధిక పనిభారం, కఠినమైన గడువులు, ఉద్యోగ అభద్రత, తక్కువ జీతం, తగినంత ఉద్యోగ నైపుణ్యాలు, సరిపోని పని వాతావరణం, కొన్ని ప్రచార అవకాశాలు, వేధింపులు మరియు సీనియర్ల నుండి వివక్ష.

  పని-సంబంధిత ఒత్తిడిని అనేక విధాలుగా పరిష్కరించవచ్చు:

 • మీ ఆందోళనల గురించి మీ యజమానితో మాట్లాడండి

 • చక్కగా నిర్వహించండి మరియు మీ రోజువారీ పనులను ప్రాధాన్యత క్రమంలో జాబితా చేయండి

 • ఆరోగ్యకరమైన ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ ఆహారం మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి

 • ధ్యానం లేదా యోగా చేయండి

 • విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఇతర కార్యకలాపాలను కొనసాగించడానికి తగినంత ఖాళీ సమయాన్ని వెచ్చించండి.

 • ధూమపానం, మద్యం మరియు డ్రగ్స్ వంటి ఒత్తిడికి దూరంగా ఉండండి.

  ఇవేవీ మీకు సరైన పరిష్కారాన్ని ఇవ్వకపోతే మానసిక నిపుణుడిని కలవడం మాత్రం మర్చిపోవద్దు.