Jacqueline Fernandez దుస్తులకే 3 కోట్లు.. సుకేష్ యవ్వరాలు. ఈడీ విచారణలో బయటపెట్టిన స్టైలిష్ట్!

బలవంతపు వసూళ్లకు సంబంధించి 200 కోట్ల కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో బాలీవుడ్ నటి జ్వాక్వలైన్ ఫెర్నాడేంజ్ రిలేషన్‌షిప్ మరో బట్టబయలైంది. ఈ కేసులో కోట్లాది రూపాయలను జాక్వలైన్‌కు సుకేష్ ఇచ్చారనే కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలు దఫాలు జాక్వలైన్‌ను విచారించిన ఈడీ అధికారులు తాజాగా ఆమె స్టైలిష్ట్ లేపాక్షి ఎల్లవాడిని 8 గంటలపాటు విచారించారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుకేష్, జాక్వలైన్ సహజీవనం గురించి ఏం చెప్పారంటే?

తమిళనాడుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ గతంలో పలు నేరాల్లో నిందితుడుగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో రాన్ బాక్సీ ప్రమోటర్లను బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులో సుకేష్‌ను అరెస్ట్ చేశారు. సుకేష్‌ చంద్రశేఖర్‌పై 215 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఆయనను పలు మార్లు విచారించడం తెలిసిందే.

సుకేష్ చంద్రశేఖర్‌తో రిలేషన్‌షిప్ కొనసాగించడం మీడియాలో చర్చనీయాంశమైంది. జాక్వలైన్‌కు భారీగా ధనం వెచ్చించి.. ముంబైలో సముద్రానికి అభిముఖంగా ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను జాక్వలైన్‌కు సుకేష్ ఇవ్వడం కూడా భారీ చర్చకు దారి తీసింది. జాక్వలైన్, సుకేష్‌కు సంబంధించిన సన్నిహితంగా, ముద్దులు పెట్టుకొంటూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరి మధ్య సంబంధాలకు ఆధారాలు లభించాయి.

సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వలైన్‌కు అక్రమ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. సుకేష్ బలవంతపు వసూళ్ల నుంచి 10 కోట్ల మేర లబ్ది పొందారు అని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో జాక్వలైన్‌కు చెందిన 7 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేశారు. ఈ క్రమంలో అధారాలు బలంగా ఉండటంతో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌పై చార్జిషీట్‌లో పేరును చేర్చారు. ఈ మధ్య కాలంలో జాతీయ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. దాంతో ఆమె పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

ఇక కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌‌కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టేందుకు ఈడీ రెండోసారి స్టైలిష్ట్ లీపాక్షి ఎల్లవాడిని రెండోసారి విచారించింది. లేపాక్షి పలువురు బాలీవుడ్ తారలకు స్టైయిలిస్ట్‌గా పనిచేసింది. జాక్వలైన్‌కు గత 10 ఏళ్లుగా స్టయిలిష్ట్‌గా పనిచేస్తున్నది. ఈ క్రమంలోనే పలు కోణాల్లో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. గతంలో జాక్వలైన్‌తో కలిపి ఎల్లవాడిని విచారించాలని భావించారు. కానీ ఆమె రాకపోవడంతో తాజాగా సపరేట్‌గా విచారించారు.

బుధవారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా.. సుకేష్, జాక్వలైన్‌కు సంబంధాలు ఉన్నాయి. తనకు సుకేష్ పలుమార్లు ఫోన్ చేసి.. జాక్వలైన్ ఎలాంటి వస్తువులు, దుస్తులు అంటే ఇష్టమని తెలుసుకొనే వాడు. ఆమెను మచ్చిక చేసుకోవడానికి భారీగా బహుమతులు ఇచ్చేవారు అని లీపాక్షి తెలిపారు.

జాక్వలైన్ ఫెర్నాండేజ్ కోసం బ్రాండెడ్ దుస్తులు కొనమని 3 కోట్ల రూపాయలు సుకేష్ ఇచ్చారు. తన బ్యాంక్ అకౌంట్‌కు సుకేష్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ డబ్బుతో జాక్వలైన్ కోసం దుస్తులు, బహుమతులు కొన్నాను. అయితే సుకేష్ అరెస్ట్ తర్వాత అతడితో జాక్వలైన్ తెగతెంపులు చేసుకొన్నది అని లీపాక్షి చెప్పారు.