Chennakesava Reddy స్పెషల్ షోలు.. అడ్వాన్స్ బుకింగ్స్ ర్యాంపేజ్.. పోకిరి, జల్సా రికార్డులు బ్రేక్ అయ్యేలా..

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా అభిమానులు వారి హీరోల ట్రెండ్ సెట్ సినిమాల స్పెషల్ షోల కోసం ఎగబడుతున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం విడుదలైన సినిమాల కోసం ఇప్పుడు థియేటర్లో టికెట్ల కోసం ఎగబడుతున్నారు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ హవా మామూలుగా కనిపించడం లేదు.

20 ఏళ్ల తర్వాత మళ్లీ స్పెషల్ షోలతో చెన్నకేశవరెడ్డి సినిమా సందడి చేయబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన టికెట్ల కోసం కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్సులతోనే చెన్నకేశవరెడ్డి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

2002 సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ అలాగని నష్టాలను కూడా కలిగించింది లేదు. అప్పుడే ఆది సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఊహించని సక్సెస్ అందుకున్న మాస్ డైరెక్టర్ వివి వినాయక్ బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఒక్కసారిగా తారస్థాయికి చేరిపోయాయి.

అయితే చెన్న కేశవ రెడ్డి సినిమా విడుదల తర్వాత మాత్రం కొంత నెగిటివ్ టాక్ ను కూడా అందుకుంది. కానీ అందులో ఉన్న కొన్ని సన్నివేశాలకు మాత్రం ఇప్పటికే అభిమానులు విజిల్స్ వస్తూ ఉంటారు. ముఖ్యంగా సుమోలను గాలిలోకి లేపే ట్రెండ్ ను అక్కడ మరింత బలంగా వినాయక్ ఫాలో అయ్యాడు. మళ్లీ బాలయ్యతో వినాయక్ అలాంటి సినిమా చేస్తే చూడాలని కూడా చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే ఇప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షోలో సందడి చేయబోతున్నాయి. ఇక అలాంటి సన్నివేశాలను మరోసారి ధియేటర్లో చూడాలి అని అభిమానులు కూడా తీవ్రస్థాయిలో టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నెల 24వ తేదీన స్పెషల్ షోలో ప్రదర్శించబోతున్నారు. ముఖ్యంగా యూఎస్ లో అయితే భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన థియేటర్స్ లిస్ట్ కూడా బయటకు వచ్చింది.

ఈ నెల 24వ తేదీన 25వ తేదీన ప్రత్యేకంగా స్పెషల్ షోలు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక చెన్నకేశవరెడ్డి విడుదలై 20 ఏళ్ళు అయిన సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కూడా విదేశాల్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అమెరికాలో అయితే ఇప్పటికే 31 లొకేషన్లో సినిమాకు సంబంధించిన సగం టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 1059 టికెట్లు అమ్ముడుపోవడంతో గ్రాస్ 13,327,92 డాలర్లు వచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అయితే ఇప్పటికే నాలుగు షోలకు సంబంధించిన టికెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 524 టికెట్లు చాలా వేగంగా అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. చూస్తూ ఉంటే ఆస్ట్రేలియాలో జల్సా, పోకిరి స్పెషల్ సోలార్ రికార్డును బాలయ్య బ్రేక్ చేసే ఉన్నాడు అనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రికార్డుల గురించి ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉన్నారు.