Bigg Boss Telugu 6: శ్రీ సత్య లవ్ స్టోరీ.. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్.. సూసైడ్ అటెంప్ట్!

2016లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిం బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ శ్రీ సత్య. ఈ చిత్రంలో రామ్ మాజీ ప్రేయసిగా నటించిన శ్రీ సత్య.. బిగ్ బాస్ హౌజ్ లో ఉండే పద్ధతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్నటి వరకు నాగార్జునతో తిట్లు తిట్టించుకున్న ఈ భామ తాజాగా పుంజుకుంది. మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో బాగానే గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్, హోస్ట్ నాగార్జునకు ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించింది. అలాంటి శ్రీ సత్య రియల్ లైఫ్ లవ్ స్టోరీపై ఓ లుక్కేద్దామా!

బిగ్ బాస్ హౌజ్ లోకి అందమైన బ్యూటీలు ఎంటర్ అవడం సాధారణమే. ప్రతి సీజన్ లోనూ ఒకరిద్దరిని హౌజ్ లోకి ప్రవేశపెడతారు బిగ్ బాస్ నిర్వహకులు. ఈ సీజన్ లో కూడా వాసంతి, కీర్తి భట్ తోపాటు సీరియల్ నటి, మిస్ విజయవాడ, మిస్ ఆంధ్ర అయిన శ్రీ సత్య ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ కాస్తో కూస్తో గ్లామర్ గా కనిపిస్తూ కనువిందు చేసింది. కానీ, ఎలాంటి గేమ్ ఆడకుండా, సైలెంట్ గా ఉంటూ నామినేట్ అవుతూ వచ్చింది.

ఇక రెండోవారంలో ఇచ్చిన ఆటతీరుకు అక్షంతలు సైతం పడ్డాయి. తినడం, పడుకోవడంపైన ఉన్న కాన్సంట్రేషన్ ఆట ఆడటంపై లేదు అని నాగార్జున అనడం తెలిసిందే. ఇక నాగార్జున ఇచ్చిన కౌంటర్ లతో శ్రీ సత్య ఆట తీరు మారినట్లే కనిపిస్తోంది. మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇచ్చిన అడవిలో ఆట గేమ్ లో బాగానే ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గీతూ రాయల్ పెట్టుకున్న రూల్స్ గురించి మాట్లాడుతూ ఆమెతోనే ఆడుకోండి అని బిగ్ బాస్ కు, అలా ఆడితోనే చప్పట్లూ కొడతారు అంటూ హోస్ట్ నాగార్జునకు ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించింది.

అయితే ఇంతకుముందు శ్రీ సత్యను నామినేట్ చేసేందుకు కారణాల్లో ఆమె ఏ కంటెస్టెంట్ తో కలవదు, సైలెంట్ గా ఉంటుందని చెప్పారు. అలా ఉండటానికి తన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయని, అవే కారణమని ఎమోషనల్ కూడా అయింది శ్రీ సత్య. అది తన రియల్ లైఫ్ లవ్ స్టోరీనే అని తెలుస్తోంది.

శ్రీ సత్య టీనేజ్ నుంచే పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది. కొన్నాళ్ల పాటు రిలేషన్ లో ఉన్న తర్వాత పెళ్లికి సైతం రెడీ అయ్యారు. పెళ్లి వరకు వచ్చి తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీ సత్య. ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం పవన్ రెడ్డి తనను మోసం చేయడమే అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. నిశ్చితార్థం తర్వాత కూడా రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలియజేసింది.

అయితే పవన్ రెడ్డి వాదన మరోలా ఉంది. ఇది శ్రీ సత్య వెర్షన్ మాత్రమే అని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ఆమె తనను మోసం చేసిందని, నిజంగా తాను మోసం చేయాలనుకుంటే ఎంగేజ్ మెంట్ ఎందుకు చేసుకుంటాను, పెళ్లి వరకు ఎందుకు వస్తానని పవన్ రెడ్డి తెలిపాడు. ఇక వీరి మాటల్లో ఎంత నిజముందో తెలియదు. కానీ ఈ విషయాల కారణంగానే శ్రీ సత్య సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా శ్రీ సత్య నిన్నే పెళ్లాడతా, ముద్ద మందారం, త్రినయని, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు వంటి తదితర సీరియల్ల ద్వారా పాపులర్ అయింది. విజయవాడలో పుట్టిన శ్రీసత్య బీబీఎం పూర్తి చేసింది. యాక్టింగ్ పై ఇష్టంతో మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. మిస్ విజయవాడ, మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ సైతం సొంతం చేసుకుంది. లవ్ స్కెచ్, ఏఎన్ఆర్ కన్ఫ్యూజ్ అయ్యాడు, తరుణం, అంతా భ్రాంతియేనా వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఇక ఈ యాక్టింగ్ కెరీర్ కోసం తన ఎంబీబీఎస్ ను వదులుకొని వచ్చినట్లుగా తెలిపింది శ్రీ సత్య.