Bigg Boss Telugu 6: ఒంటి మీద డ్రెస్ తీసేశారు.. నేహాకు చెంప దెబ్బ.. ఆరోహిని కాలుతో తన్నిన ఇనయ!

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో కంటెస్టెంట్ లు రచ్చ చేస్తూ మంచి కంటెంట్ ఇస్తున్నారు. మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ప్రవేశ పెట్టిన అడవిలో ఆట గేమ్ ను 17వ రోజు కూడా కొనసాగించారు. 17వ రోజు 18వ ఎపిసోడ్ లో ఫిజికల్, గొడవలు, అరుపులు, కొట్టుకోడాలతో మరింత జోరుగా మారింది గేమ్. అయితే టాస్క్ నియమ నిబంధనలను కంటెస్టెంట్లు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో వారిని వారించాడు బిగ్ బాస్. ఏ టీమ్ ఎలా ఆడాలో వివరిస్తూ మళ్లీ రూల్స్ చెప్పాడు. ఇక బుధవారం అంటే సెప్టెంబర్ 21న జరిగిన 18వ ఎపిసోడ్ లో ఇనయ, నేహ, ఆరోహిల మధ్య పోటీ ఫిజికల్ అయిందనే చెప్పవచ్చు.

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో హౌజ్ లో ప్రస్తుతం మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో భాగంగా అడవిలో ఆట అనే గేమ్ లో పోలీసులు (బాలాదిత్య, ఫైమా, ఇనయ సుల్తానా, ఆది రెడ్డి, రోహిత్ అండ్ మెరీనా, రాజ్, శ్రీ సత్య, చంటి) దొంగలు (శ్రీహాన్, రేవంత్, నేహా చౌదరి, ఆరోహి, ఆర్జే సూర్య, సుదీప, వాసంతి, అర్జున్ కల్యాణ్), అలాగే అత్యాశ గల వ్యాపారస్తురాలు (గీతూ రాయల్) ఎవరికీ నచ్చినట్లు వాళ్లు గేమ్ ఆడారు.

దీంతో బిగ్ బాస్ వారికి మళ్లీ రూల్స్ చెబుతూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆట నియమ నిబంధనలను మళ్లీ ఒకసారి వివరించాడు. అలా అడవిలో ఆటను కొనసాగించారు ఇంటి సభ్యులు. రైడ్ కు వెళ్లినప్పునప్పడు పోలీసులను దొంగలు పట్టుకోవచ్చు. రైడ్ ముగిశాక వారు పోలీసులు ఇంట్లోనే ఉంటే వారిని కిడ్నాప్ చేయొచ్చు దొంగలు. అలాగే పోలీసులు ఇంటిలోని ఏ ప్రాంతంలో రైడ్ చేస్తామని చెబుతారో ఆ ప్లేస్ లో మాత్రమే రైడ్ చేయాల్సి ఉంటుంది.

కానీ పోలీసులు చెప్పని ప్లేస్ అయిన స్టోర్ రూమ్ లో ఇనయ వస్తువుల కోసం వెతుకులాట ప్రారంభించింది. దీంతో దొంగలుగా ఉన్న కంటెస్టెంట్లు ఇనయను పట్టుకున్నారు. స్టోర్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. అయితే పోలీసులను ఇద్దరి కన్నా ఎక్కువ దొంగలు పట్టుకోరాదు. కానీ ఇనయను ఇద్దరి కంటే ఎక్కువ దొంగలే పట్టుకునేందుకు ప్రయత్నించారు.

దీంతో తాను తప్పించుకునే క్రమంలో నేహా చౌదరిని ఇనయ కావాలని కొట్టిందో? అలా అనుకోకుండా జరిగిందో తెలియదు. కానీ ఆరోహిని మాత్రం కాలుతో తన్నింది ఇనయ. ఇక చెంప దెబ్బ తిన్న నేహా చౌదరి తెగ ఫీల్ అయింది. కొంచెం బాగానే హర్ట్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు తన డ్రెస్ ను ఎవరో లాగారని, తీసేశారంటూ ఇనయ అనేసింది. తనపై హార్ష్ ఫిజికల్ ఎటాక్ చేశారని తాను కూడా ఏడుపు మొఖం పెట్టేసింది.

అయితే తన డ్రెస్ ను లాగారని చెప్పడం తప్పు మాటలు అని, అలా జరగలేదని మధ్యలో దూరింది చిత్తూరు చిరుత గీతూ రాయల్. నువ్ తప్పులు మాట్లాడుతున్నావ్, మాటలు మారుస్తున్నావ్ అని దొరికిందే అవకాశం అన్నట్లుగా ఇనయను ఏసుకునే ప్రయత్నం చేసింది గీతూ. దీంతో వీరిద్దరి మధ్య మళ్లీ కొద్దిసేపు మాటలతో వాగ్వాదం జరిగింది. ఇక గీతూ తన గేమ్ ఆడుతూ ఆర్జే సూర్య, శ్రీహాన్ లతో తన వస్తువులు కాపాడుకునేందుకు, వాళ్లు ముగ్గురు కంటెండర్ గా అయ్యే ఛాన్స్ లు మాట్లాడుతూ డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేసింది.

ఇదిలా ఉంటే రేవంత్ ను కంటెండర్ అయ్యేలా చేయకూడదు అని అతని వస్తువులు కొట్టేస్తారు నేహా, ఆరోహి. తర్వాత తన బొమ్మలు ఎవరో కొట్టేశారని ఊగిపోయాడు రేవంత్. సిగ్గూ, శరం లేదా అంటూ ఫైర్ అయ్యాడు. జెన్యూన్, నీతి కబుర్లు చెబుతారు ఇలా చేస్తారు అంటూ అసహనం వ్యక్తం చేస్తారు. తన దొంగల టీమ్ ఇలా చేయడంతో పోలీసులను గెలిపిస్తా అంటూ ఆ దిశగా ప్రయత్నం చేశాడు రేవంత్.