విశాఖలో భారీ వినాయకుని ప్రతిమకు నిమజ్జనం

స్వరూపానందేంద్ర స్వామి చేతులమీదుగా సాగిన ఉత్సవం

తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద విగ్రహం

102 అడుగుల ఎత్తున దొండపర్తిలో కొలువుదీరిన గణపయ్య

21 రోజుల అనంతరం అనుపు చేపట్టిన నిర్వాహకులు

ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో తెలుగు రాష్ర్టాల్లో ఏర్పాటైన అతి పెద్ద విగ్రహానికి వేడుకగా నిమజ్జనం చేసారు. విశాఖ నగర పరిధిలోని దొండపర్తి ప్రాంతంలో ఈ వినాయక ప్రతిమ ఏర్పాటైంది. దీని ఎత్తు 102 అడుగులు. వినాయక చవితి వేడకల్లో 21 రోజులపాటు ఈ బొజ్జ గణపయ్య పూజలు అందుకున్నాడు. నిమజ్జన వేడుకలకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హాజరయ్యారు. ఆయన చేతులమీదుగా నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. పూర్తిగా మట్టితో తయారైన ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమను పుణ్య నదులతో పాటు త్రివేణి సంగమం నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో నిమజ్జనం చేసారు నిర్వాహకులు.