రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్..? కారణమిదే.. రాహుల్ అలా అనడంతో

యువనేత సచిన్ పైలట్ కల నెరవేరబోతోంది. రాజస్థాన్ సీఎం పదవీ చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీకి పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నిక కూడా లాంఛనమే కానుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు జోడు పదవులు వద్దు అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. దీంతో పైలట్‌కు సీఎం కుర్చీ మరింత దగ్గర అవుతుంది.

అధ్యక్ష పదవీకి ఎవరైనా పోటీ చేయొచ్చు. ఉదయ్‭పూర్ తీర్మానాన్ని జవదాటకూడదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కొద్ది రోజుల క్రితం సమావేశంలో ఒకరికి ఒక పదవీ మాత్రమే అనే తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. రాహుల్ గాంధీ పరోక్షంగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దిగనున్న గెహ్లట్.. రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారు. ఇందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. సీఎం పదవీకి రాజీనామా చేయాల్సిందేనని సోనియా గాంధీ స్పష్టం చేశారట. దీంతో గెహ్లట్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

తన ప్రత్యర్థిసచిన్ పైలట్ రావడం గెహ్లట్‭కు ఇష్టం లేదు. పైలట్‭ను కాదని, ఇతరులను సీఎం చేసేందుకు అధిష్టానం సముఖంగా లేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు నామినేషన్లకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీకి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలో పోటీ చేయడం లేదని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. అశోక్ గెహ్లట్, శశి థరూర్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది.

మధ్యలో తాను కూడా రంగంలోకి దిగుతానని దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. చూడాలీ ఈ పోరు.. ద్వి ముఖం.. లేదంటే త్రిముఖం అనేది తేలాల్సి ఉంది.