న్యూడ్ కాల్స్ చేసి.. రివర్స్, సోషల్ మీడియాలో అంటూ యువతి బెదిరింపులు

హైదరాబాద్: న్యూడ్ కాల్స్‌తో ఓ యువతి తనను వేధింపులకు గురిచేస్తుందని యువకుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీడియో కాల్ రికార్డు చేసి న్యూడ్ మారుస్తోందని.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువకుడు(26)కి నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో స్వీట్‌గర్ల్ 948 ఐడీ పేరిట ఉన్న ఓ యువతి పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరి మధ్య సంభాషణలు కొనసాగాయి. ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుని చాటింగ్ చేసేవారు.

ఈ క్రమంలో రెండు రోజులు వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. అయితే, ఆ యువతి న్యూడ్ వీడియో కాల్ చేసింది. దీంతో అతడు కూడా అదే పనిచేశాడు. అయితే, ఇప్పుడే అతడు ఆ కిలేడీ ఉచ్చులో పడిపోయాడు.

ఆ యువకుడి నగ్న వీడియోలు, చిత్రాలను రికార్డు చేసిన ఆ యువతి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. రూ. 5 వేలు, రూ. 10 వేలు పంపాలంటూ సందేశాలు పంపిస్తోంది. దీంతో ఆమె వేధింపులు భరించలేక గురువారం గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు బాధిత యువకుడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు