తలకిందులైన బుల్లితెర నటి జీవితం.. నగలు అమ్మేసి మరి కాల్ సెంటర్ లో పని

సినీ రంగం అనే రంగుల ప్రపంచం చూడటానికి కలర్ ఫుల్ గా బయటకు బాగున్నా అందులో నటించే నటీనటుల జీవితాలు అంతే అందంగా ఉంటాయని గ్యారంటీ లేదు. ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటికే చాలా చూశాం. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. అందులో సినీ రంగం కూడా. కరోనా రక్కసితో ఎంతోమంది నష్టపోయారు. వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అవకాశాలు రాక, డబ్బులు లేక నానా అవస్థలు పడినవారు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బుల్లితెర నటి ఏక్తా శర్మ. ఆమె ప్రస్తుతం కాల్ సెంటర్ లో పని చేయడం చర్చనీయాంశమైంది.

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయో చెప్పలేం. ఆకాశంలో స్టార్స్ గా వాళ్లను మనం చూస్తాం. కానీ ఉన్నట్టుండి తోక చుక్కల్లాగా ఎప్పుడు రాలిపోతారో ఎప్పుడు అంచనా వేయలేం. సినీ రంగంలో వెలుగు వెలిగిన వారు సైతం సాధారణ స్థితికి వెళ్లిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు.

అలాంటి వారిలో సీరియల్ నటి ఏక్తా శర్మ ఒకరు. కరోనా కారణంగా సరైన అవకాశాలు రాక, చేతిలో డబ్బుల్లేక ఇల్లు గడవడానికి కాల్ సెంటర్ లో పనిచేస్తుంది ఏక్తా శర్మ. సినీ పరిశ్రమలో సరైన అవకాశాలు రాకపోవడంతో తనకున్న చదువు రీత్యా ఈ జాబ్ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఈ ఇంటర్వ్యూలో ”కరోనా కారణంగా జీవితం తలకిందులైంది. అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఉన్న నగలు కూడా అమ్మేశా. సినిమాల్లో అవకాశాలు రావట్లేదని ఏడుస్తూ ఇంట్లోనే కూర్చో లేను కదా. అందుకే కాల్ సెంటర్ లో పనిచేస్తున్నా. ఈ జాబ్ చేస్తున్నందుకు నాకేం తప్పనిపించడం లేదు.

ప్రస్తుతం కోర్టులో నా కుమార్తె కస్టడీ కేసు నడుస్తోంది. ఎవరో వస్తారు. ఏదో అద్భుతం జరుగుతుంది అని ఎదురు చూడలేను. అందుకే ఈ కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూనే, ఆడిషన్స్ కూడా ఇస్తున్నా. త్వరలోనే నాకు మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా” అని తెలిపింది ఏక్తా శర్మ.

ఇదిలా ఉంటే ఏక్తా శర్మ.. డాడీ సంఝా కరో, కుసుమ్, క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ, కామినీ-దామినీ వంటి తదితర సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందింది. ఇక చివరిగా బెప్నా ప్యార్ అనే టీవీ షోలో కనిపించింది ఈ సీరియల్ నటి ఏక్తా శర్మ.