టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు

     Bredcrumb

Updated: Thursday, September 22, 2022, 15:55 [IST]  

దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'టాటా మోటార్స్' (Tata Motors) యొక్క 'టాటా పంచ్' (Tata Punch) ఎట్టకేలకు 'క్యామో ఎడిషన్' (Camo Edition) లో విడుదలైంది. ఈ కొత్త ఎడిషన్ ధరలు రూ. 6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

Recommended Video

భారతీయ మార్కెట్లో Tata Nexon కొత్త వేరియంట్ లాంచ్ | వివరాలు

మార్కెట్లో విడుదలైన కొత్త ‘టాటా పంచ్ క్యామో ఎడిషన్’ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

    టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు  టాటా పంచ్ కామో ఎడిషన్ అనేది కజిరంగా ఎడిషన్ తర్వాత విడుదలైన టాటా పంచ్ యొక్క రెండవ స్పెషల్ మోడల్. నిజానికి క్యామో ఎడిషన్ అనేది 2020 నవంబర్ లో టాటా మోటార్స్ యొక్క హారియర్‌తో ప్రారంభమైంది. ఆ తరువాత ఇతర మోడల్స్ కూడా ఈ క్యామో ఎడిషన్ లో విడుదల కావడం ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు టాటా పంచ్ కూడా క్యామో ఎడిషన్ లో విడుదలైపోయింది.

టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్ లో ఎక్స్టీరియర్ మరియి ఇంటీరియర్ ఫీచర్స్ లో కొన్ని అప్డేట్స్ గుర్తించవచ్చు. అయితే ఇంజిన్ లో ఎటువంటి మార్పలు జరగలేదు, కావున అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాటా పంచ్ క్యామో ఎడిషన్ పర్ఫామెన్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు టాటా పంచ్ క్యామో ఎడిషన్ లో గమనించ దగ్గ విషయం దాని కలర్ ఆప్సన్. కావున ఇది కొత్త ‘ఫోలేజ్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్’ లో కనిపిస్తుంది. అయితే రూప్ మాత్రం పియానో ​​బ్లాక్ లేదా ప్రిస్టైన్ వైట్‌ కలర్ లో ఉంది. మొత్తం మీద ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా డ్యూయెల్ కలర్ లో ఉంటుంది

టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు గ్రిల్‌కి కింది భాగంలో క్రోమ్ ట్రిమ్ బ్లాక్ అవుట్ చేయబడి ఉంది. అంతే కాకూండా ఫ్రంట్ బంపర్‌లో కొత్త సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ పూర్తిగా బ్లాక్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. స్టాండర్డ్ మోడల్ లో డ్యూయల్-టోన్ వీల్స్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్‌లపైన క్యామో బ్యాడ్జింగ్ కూడా చూడవచ్చు. మొత్తం మీద డిజైన్ మునుపటికంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంది.

టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని సీట్లు మిలిటరీ గ్రీన్ షేడ్‌ను పొందుతాయి. అదే సమయంలో ఇందులో 7 ఇంచెస్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హర్మాన్ ఆడియో సిస్టం కూడా ఉన్నాయి. ఇందులోని 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెదర్ స్టీరింగ్ మరియు గేర్ నాబ్ వంటివి అలాగే ఉన్నాయి.

టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు టాటా పంచ్ క్యామో ఎడిషన్ అనేది అడ్వెంచర్ మరియు అకాంప్లిష్డ్ ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇందులో 1.2-లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 86 హెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు టాటా పంచ్ క్యామో ఎడిషన్ భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ఇగ్నిస్ మరియు మహీంద్రా కెయువి100, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో గట్టి పోటీకి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ముందుగా చెప్పుకున్నట్లు టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ గా నిలిచింది. అయితే ఈ పండుగ సీజన్ లో కొత్త కలర్ ఆప్సన్ తో విడుదలకావడం వల్ల మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే తెలుస్తుంది.

          English summary

Tata punch camo edition launched in india at rs 6 85 lakh details